టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ ఒకటి. ఇప్పటివరకు ఈ బ్యానర్ వారు ఎన్నో సినిమాలను నిర్మించారు. అందులో చాలా శాతం మూవీలు అద్భుతమైన విషయాలను అందుకున్నాయి. ఇకపోతే వీరు సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా ఆ సినిమాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలను ఉపయోగిస్తూ ఉంటారు అందులో భాగంగా గీత ఆర్ట్స్ వారు ఇప్పటివరకు తాము నిర్మించిన సినిమాలతో ఎన్నో కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలను తీసుకువచ్చారు. మరి వారు కొత్తగా పరిచయం చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
చిరంజీవి హీరోగా రూపొందిన మాస్టర్ మూవీ ని ఈ బ్యానర్ వారే నిర్మించారు. తెలుగులో ఫస్ట్ ఆడియో సిడిని మార్కెట్లోకి ఈ సినిమా ద్వారానే తీసుకువచ్చారు.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన జానీ మూవీన్ని ఈ బ్యానర్ వారు నిర్మించారు. ఇక ఈ సినిమా మెర్చండిసింగ్ లో మొదటి సినిమా.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన జల్సా మూవీ ని ఈ బ్యానర్ వారే నిర్మించారు. ఇక వీరు ఈ సినిమాతో మొబైల్ గేమ్ బేస్డ్ ను తీసుకువచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ బ్యానర్ వారు మగధీర సినిమాను రూపొందించారు. ఈ బ్యానర్ వారు ఈ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ బ్లూ రై ఫార్మాట్ ను తీసుకువచ్చారు.
అల్లు అర్జున్ తో ఈ బ్యానర్ వారు సరైనోడు అనే సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ బ్యానర్ వారు ఈ సినిమాతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఈ బ్యానర్ వారు నాగ చైతన్య తో తండెల్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం మొట్ట మొదటి సారి మూవీ రిలీజ్ డేట్ కోసం ఈ బ్యానర్ వారు ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.