టిట్ ఫర్ టాట్: ఆ రోజులు మర్చిపోకు బ్రదర్...!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నాగచైతన్య పేరు ఎలా ట్రోలింగ్ కి గురయిందో మనం చూసాం . సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడమే దానికి మెయిన్ రీజన్ . అయితే విడాకులు తర్వాత చాలా సైలెంట్ గా ఉన్న నాగచైతన్య ఎవరు ఊహించిన విధంగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అసలు మేటర్ బయటపడింది.  సైలెంట్ గా ఉన్న నాగచైతన్య తెరవెనక ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా ..? అంటూ జనాలు షాక్ అయిపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఘనంగా జరగబోతుంది .


దీనికి సంబంధించి వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . అదే మూమెంట్లో తండేల్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు నాగచైతన్య . సాధారణంగా నాగచైతన్య తన సినిమాల విషయంలో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ప్రవర్తించరు . తన పని తాను చేసుకుని పోతూ ఉంటాడు . అయితే నాగచైతన్య తండేల్ సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా రీసెంట్  ప్రెస్ మీట్ లో నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు . కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు . సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు అయితే అక్కినేని అభిమానులను ముందుగానే వెళ్లి కొత్త షర్ట్స్ కూడా కొనుక్కోమంటూ సజెషన్స్ ఇచ్చారు .


సినిమా రిలీజ్ తర్వాత కాలర్ ఎగరేసి మరి ఇది మా నాగచైతన్య సినిమా అని చెప్పుకునే రేంజ్ లో ఉంటుంది ఈ మూవీ అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే ఇక్కడే అందరికీ పెద్ద డౌట్ కొడుతుంది. నాగచైతన్య గతంలో "లాల్ సింగ్ చద్దా"  సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇంతే ఓవర్గా మాట్లాడాడు.. ఓవర్ కాన్ఫిడెన్స్ గా బిహేవ్ చేశారు.  ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనకు తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పై మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు . లాల్ సింగ్ చద్దా సినిమా నాటి రోజులు మర్చిపోకు బ్రదర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. నాగచైతన్య వాళ్ళ నోరులు మూయించాలి అంటే కచ్చితంగా తండేల్  సినిమా హిట్ అవ్వాల్సిందే . లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండిపోతుంది . కొత్తకోడలు రాకతో మరోసారి ఫ్లాప్ అంటూ శోభితాను ట్రోల్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: