రోజులు లెక్కపెట్టుకో శోభిత ధూళిపాళ్లకు సమంత వార్నింగ్.. అసలు ఏమైందంటే..!
ఈ రీసెంట్ టైమ్స్ లో హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పెళ్లి చేసుకుంటున్న జంట కూడా నాగచైతన్య శోభితలే అని అంటున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరి వివహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు కూడా అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు శోభితకి సమంత అనే ఓ సోదరి కూడా ఉంది. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన అక్క పెళ్లి హడావుడి మొత్తం ఈమె చూసుకుంటుంది.. సోషల్ మీడియాలో ఈమె తన అక్క పెళ్లి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వాటికి ఏదో ఒక కామెంట్ పెడుతూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా ఆమె తన అక్క అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే దాని కింద కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ పిక్స్‌లో అక్కినేని ఇంటికి కాబోయే కోడలు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ, పెళ్లి కూతురు బొమ్మను చూస్తూ కనిపించింది. ప్రజెంట్ సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన అక్కినేని అభిమానులు పెళ్లి డేట్ అనౌన్స్ చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం కంగ్రాట్స్ చెబుతూ శోభిత అందాన్ని పొగుడుతున్నారు.