సంగీత దర్శకుడిగా , నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో జీ వి ప్రకాష్ కుమార్ ఒకరు. ఈయన ఎక్కువ శాతం తమిళ సినిమాలకు సంగీతం అందించి , తమిళ సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన తమిళ్ తో పాటు వరుస పెట్టి తెలుగు సినిమాలకు కూడా సంగీతాన్ని అందిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు.
అక్టోబర్ 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ "మట్కా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు కూడా జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జీ వి ప్రకాష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు మీరు తెలుగు సినిమాల్లో ఎప్పుడూ నటిస్తారు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ ... తెలుగులో నటించాలి అని నాకు కూడా ఉంది. నాని హీరోగా రూపొందిన దసరా మూవీలో సూరి పాత్ర కోసం మొదట నన్నే అడిగారు. కానీ ఆ సమయంలో నేను బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఏదైనా మంచి పాత్ర వస్తే కచ్చితంగా తెలుగు సినిమాల్లో నటిస్తాను అని ఆయన అన్నాడు.