4వేల పారితోషికం నుండి 600 కోట్ల వరకు.. నాగ్ అశ్విన్ సక్సెస్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!!

Pandrala Sravanthi
- 4000 మొదటి రెమ్యూనరేషన్..
- మహానటి మూవీ తో ఇండస్ట్రీలో సంచలనం..
- 600 కోట్ల బడ్జెట్ తో కల్కి..

 చాలామంది దర్శకులు ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వడం తోనే ఎంతో పొగరుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ డైరెక్టర్ ని చూస్తే అలా అనిపించదు. ఎందుకంటే కల్కి వంటి పాన్ ఇండియా మూవీని ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో తీసి దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటారు.అసలు ఈయన డైరెక్టరేనా అని చాలామందికి అనుమానం కూడా కలుగుతుంది.అంత సింపుల్ గా ఉంటారు.అయితే అలాంటి ఈ డైరెక్టర్ సినీ ప్రస్థానం ఎలా సాగింది అనేది ఇప్పుడు చూద్దాం
 నాగ్ అశ్విన్ సినీ ప్రస్థానం :


 నాగ్ అశ్విన్ ది తెలంగాణనే.. ఈయన పేరెంట్స్ ఇద్దరు పెద్ద డాక్టర్లు కావడంతో కొడుకు కూడా డాక్టర్ కావాలని ఆశించారు. కానీ కొడుకుకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకొని కాస్త బాధపడ్డారు. కానీ ఆ తర్వాత నాగ్ అశ్విన్ నిర్ణయానికి ఎదురు చెప్పలేదు. అలా మణిపాల్ మల్టీమీడియాలో చేరి ఎడిటింగ్ నేర్చుకున్నారు. మీడియా రంగంలో స్థిరపడతారు అని పేరెంట్స్ అనుకుంటే సడన్గా అసిస్టెంట్ డైరెక్టర్ గా అవ్వాలనుకున్నారు. ఇక నాగ్ అశ్విన్ ఇంట్రెస్ట్ చూసి తల్లి శేఖర్ కమ్ముల ని కలిసింది. కానీ నెక్స్ట్ సినిమాకు తీసుకుంటానని శేఖర్ కమ్ముల చెప్పారు. అయితే ఆ సమయంలో ఏవేవో కథలు రాసి వాటికి దృశ్యరూపం తేవాలని నాగ్ అశ్విన్ ఎంతగానో తపన పడేవారట.అదే సమయంలో శేఖర్ కమ్ముల తీసిన లీడర్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అవకాశం నాగ్ అశ్విన్ కి వచ్చింది.

అయితే లీడర్ మూవీలో నటించిన రానా దగ్గుబాటి నాగ్ అశ్విన్ క్లాస్మేట్ కావడం విశేషం. ఇక ఈ సినిమా చేసే సమయంలో నాగ్ అశ్వన్ చేసిన లీడర్ మూవీ ట్రైలర్ కట్ నచ్చడంతో శేఖర్ కమ్ముల దీన్నే పెట్టుకున్నారు. అలా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసిన సమయంలో 4000 రూపాయల పారితోషికాన్ని అశ్విన్ తీసుకున్నారు. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా నాగ్ అశ్విన్ కెరియర్ క్రమక్రమంగా ఉన్నత స్థాయికి చేరింది. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్టోరీ అనుకున్న సమయంలో అశ్విని దత్ ఇద్దరు కుమార్తెలు ఈ సినిమాకి బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అలా విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాగ్ అశ్విన్ కి దర్శకుడిగా గుర్తింపు లభించింది.ఇక తర్వాత సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని తీయాలనే ఆలోచనలో ఉండి తన ఆలోచనలకు కార్యరూపం దాల్చేలా చేశారు.

 అలా విడుదలైన మహానటి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మహానటి మూవీతో నాగ్ అశ్విన్ పేరు మరింత మార్మోగిపోయింది. అలాగే నేషనల్ అవార్డులు సైతం అందుకున్నారు.ఇక తర్వాత ప్రభాస్ తో భారీ బడ్జెట్ కల్కి 2898 AD మూవీని అనుకున్నారు. అయితే ఈ విషయం తెలిసి చాలామంది నవ్వుకున్నారు. ఎందుకంటే అంత చిన్న డైరెక్టర్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోని మెయింటైన్ చేయగలరా.. ఆయనతో సినిమా తీసి హిట్టు కొట్టగలరా అనుకున్నారు. అలాగే 600 కోట్ల బడ్జెట్ అంటే కూడా అందరూ ఎగతాళి చేశారట. కానీ చివరికి కల్కి 2898 AD మూవీ విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్  సినీ కేర్ ఒక్కసారిగా హాలీవుడ్ రేంజ్ కి ఎగబాకిందని చెప్పుకోవచ్చు. అలా 4 వవేల మొదటి పారితోషికం తీసుకున్న నాగ్ అశ్విన్  ప్రస్తుతం 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమాకి డైరెక్టర్ గా చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: