పుష్ప రాజ్ మ్యానియాతో షేక్ అవుతున్న కేరళ !

Seetha Sailaja
అల్లు అర్జున్ కు కేరళలో విపరీతమైన క్రేజ్ ఉంది. మల్లు అర్జున్ అంటూ అతడి పేరు వినగానే కేవలం మళయాళ అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడ మ్యానియాలో ఉంటారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ క్రేజ్ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కేరళలో కూడ రోజురోజుకి పెరిగిపోతోంది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ సినిమాకు సంబంధించి దాదాపు 55 ఫ్యాన్స్ స్పెషల్ షోలు డిసెంబర్ 5 తెల్లవారుఝామున 4 నుంచి 7 మధ్యలో వరసగా స్క్రీనింగ్ కాబోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు కేవలం లేడీ ఫ్యాన్స్ కోసం కొన్ని ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు టాక్. కేరళలోని కొట్టరక్కారలో ఉన్న మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు గర్ల్స్ ఫాన్స్ షో పేరిట ప్రత్యేక షోను వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రస్తుతం కొనసాగుతున్న క్రేజ్ చూస్తుంటే మోహన్ లాల్ మమ్ముట్టి సినిమాల కంటే క్రేజ్ 10 రెట్ల స్థాయిలో ఉందని అంటున్నారు.

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో కూడ ఈ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ రీత్యా బన్నీ బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుండి ఈ మూవీ ప్రమోషన్ మొదలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీకి ఏర్పడిన క్రేజ్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు మించి ఉందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ 3 వందల కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఈ మూవీలో శ్రీలీల బన్నీ పక్కన ఒక ఐటమ్ సాంగ్ లో చేస్తూ ఉండటంతో ఈ ఐటమ్ సాంగ్ పట్ల కూడ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించి తమన్ అజనీష్ లోకనాథ్ లను రంగంలోకి దింపారు అన్న వార్తలు మరింత సంచలనంగా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: