ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మొనగాడు..అప్పట్లోనే కోటి రూపాయలు?

Veldandi Saikiran
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. అలాంటి వారిలో వివి వినాయక్ ఒకరు. ఇతను కామెడీని, యాక్షన్ కలగలిపి సినిమాలు తీసేవారిలో ముందు వరుసలో ఉంటాడు. సుమోలు పైకి లేవడం అనేది మనం ముఖ్యంగా వివి వినాయక్ సినిమాల్లోనే చూస్తాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన వినాయక్ ప్రస్తుతం సినిమాల పరంగా విజయాలు లేక సినిమాలు చేయడం కాస్త తగ్గించేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నెంబర్ 150" సినిమా ద్వారా మంచి హిట్ లభించినప్పటికీ క్రెడిట్ అంతా చిరంజీవికే వెళ్లింది. అనంతరం సాయి ధరమ్ తేజ్ తో కలిసి "ఇంటిలిజెంట్" సినిమా తీసిన అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో మళ్లీ తన తర్వాతి సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో "ఆది", నితిన్ తో "దిల్" ఇలా వరుసగా సక్సెస్ఫుల్ విజయాలను అందుకుని మూడవ సినిమాకి బాలయ్య బాబుతో "చెన్నకేశవరెడ్డి" సినిమా తీశాడు.

కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇటీవల ఈ సినిమా మళ్లీ రిలీజ్ అయినప్పటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వివి వినాయక్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అప్పట్లో వచ్చిన పారితోషికం గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఈ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. అప్పట్లో వినాయక మూడవ సినిమాతోనే సక్సెస్ అందుకుని అత్యధికంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

అంతేకాకుండా అప్పట్లో అంతకన్నా ఎక్కువ స్థాయిలో తనకు టాప్ రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలోనే ఏ దర్శకుడికి ఇవ్వలేనంతగా రెమ్యూనరేషన్ తనకు ఇచ్చారని వెల్లడించాడు. ఊర మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా వినాయక్‌ ఉన్నారు. అందుకే వివి వినాయక్ కి ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధమయ్యారు. మళ్లీ వినాయక్ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. దీంతో వినాయక్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: