అద్భుత సినిమాలు తీసే డైరెక్టర్ శంకర్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే.?
- ప్రేమికుడు,భారతీయుడు, జీన్స్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ హోదా..
- సమాజంలో ఉండే సమస్యలనే సినిమాల రూపంలో తీస్తూ..
జెంటిల్ మెన్ అనే మూవీ తో సౌత్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎస్.శంకర్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ప్రభుదేవా తో చేసిన ప్రేమికుడు మూవీ సౌత్ లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన భారతీయుడు శంకర్ రేంజ్ ని ఇండియా మొత్తం తెలిసేలా చేశాయి.మరి అలాంటి శంకర్ మొదటి రెమ్యూనరేషన్ ఎంత.. ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం..
శంకర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ :
డైరెక్టర్ ఎస్.శంకర్ అర్జున్ సార్జాతో కలిసి జెంటిల్ మెన్ అనే మూవీని తీశారు.ఈ సినిమాకి ఆయనే అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా చేశారు.అయితే మొదటి సినిమా అయినప్పటికీ శంకర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకి నిర్మాతగా చేసిన KTకుంజుమన్ డైరెక్టర్ శంకర్ కి పారితోషికంగా 5000 ఇచ్చారు. అయితే ఐదువేల రూపాయలను మొదటి పారితోషికంగా అందుకున్న శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కేటీ కుంజుమన్ గారు ఇచ్చిన ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ 5 లక్షలతో సమానం అంటూ చాలా సంతోషంగా చెప్పారు.అలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసే శంకర్ మొదటి రెమ్యూనరేషన్ కేవలం 5000 రూపాయలు మాత్రమే.. ఇక జెంటిల్మెన్ మూవీ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్,బాయ్స్,ప్రేమిస్తే,శివాజీ, ఐ, రోబో, ఒకే ఒక్కడు,రోబో 2 వంటి ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా చేశారు.ఇక ఈయన తీసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపేసాయి.