ఏంటి హీరో అల్లు అర్జున్ తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గొడవ పెట్టుకున్నారా.. ఇది నిజమేనా..షూటింగ్ స్పాట్ నుండి సుకుమార్ దేవిశ్రీప్రసాద్ నీ గెంటేసారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2 మూవీ పైనే ప్రస్తుతం అందరి కళ్ళు ఉన్నాయి.. ఈ సినిమా ఇప్పుడికే ఒకసారి వాయిదా పడింది.. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సంచలన వార్త మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే..ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన దేవి శ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి తమన్ తో పాటు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని పుష్ప 2 కోసం తీసుకున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది.అయితే ఇది నిజమేనని తెలుస్తోంది.
అయితే చాలా సంవత్సరాల నుండి దేవిశ్రీ ప్రసాద్ బన్నీల బంధం కొనసాగుతోంది.కానీ పుష్ప-2 సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ సరిగ్గా ఇవ్వలేదట.దీంతో దేవిశ్రీ ప్రసాద్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఈ మ్యూజిక్ బాలేదు అని చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. ఇక ఈ విషయంలో సుకుమార్ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇవ్వడంతో దేవిశ్రీప్రసాద్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అజనీష్, సామ్ సిఎస్ లు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే రీసెంట్ గా హైదరాబాదులో దేవిశ్రీప్రసాద్ ఒక పెద్ద మ్యూజిక్ కన్సర్ట్ ని పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మ్యూజిక్ కన్సర్ట్ కోసం దాదాపు 20 రోజులపాటు పుష్ప-2 మూవీ ని పక్కన పెట్టేసారట. అలా 20 రోజులపాటు దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ కన్సర్ట్ పై శ్రద్ధ పెట్టడంతో ఆగ్రహించిన సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ ని మందలించారట. అలా ముగ్గురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఫలితంగా పుష్ప-2 మూవీ నుండి దేవిశ్రీప్రసాద్ తప్పకున్నట్టు వార్తలు వస్తున్నాయి