గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్
ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “..ఈ
సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. స్టార్
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ
మూవీ మొదలై చాలా కాలం అయినా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.. ఈ సినిమాను స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. భారతీయుడు 2 రూపంలో
గేమ్ ఛేంజ
ర్ కు అనుకోని ఇబ్బందులు వచ్చాయి..శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జులై 12న రిలీజ్ అయి ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఆ
సినిమా ఎఫెక్ట్ చరణ్ మూవీపై పడుతుందేమో అని చరణ్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.. దీనికి తోడు సినిమాకు సంబంధించి అప్డేట్స్ కూడా లేట్ గా ఇస్తుండటంతో
మూవీ టీంపై ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాను
జనవరి 10, 2025
సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..
ఈ దీపావళికి
గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా అది కుదర్లేదు.. దీనితో టీజర్ ను
నవంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. అలాగే
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.. ఇదిలా ఉంటే భారతీయుడు 2 తో మరింత డౌన్ ఫాల్ అయిన
శంకర్ గేమ్ ఛేంజర్
తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.. రాంచరణ్
మూవీ తరువాత
శంకర్ స్టార్ హీరోలతో కాకుండా కొత్త వారితో ఓ క్యూట్
లవ్ స్టోరీ తీయాలనీ చూస్తున్నట్లు సమాచారం.. గతంలో తెరకెక్కించిన బాయ్స్
సినిమా మాదిరి ఈ
సినిమా ఉండనుందని తెలుస్తుంది..గతంలో వచ్చిన బాయ్స్
సినిమా మంచి విజయం సాధించింది.. దీనితో
శంకర్ మంచి డెసిషన్ తీసుకున్నారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు..అయితే
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై
శంకర్ భవిష్యత్ ఆధారపడి వుంది..