10 లక్షల రెమ్యునరేషన్ నుంచి.. 500 కోట్ల వరకు .. కొరటాల సక్సెస్ కి చేతులెత్తి మొక్కాల్సిందే..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.. అయితే ఆయన కెరియర్ లో ఒక సినిమా కూడా ప్లాఫ్ అవదు అనుకుంటున్న సమయంలో చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నీ ఎన్టీఆర్ తో దేవర చేసి పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ ఇచ్చాడు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తరువాత కొరటాల ఆ రికార్డు దిశగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రయోగాలతో రిస్క్ చేయకుండా మంచి సోషల్ మెస్సేజ్ పాయింట్ హైలెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు కొరటాల ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయి.

రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన కొరటాల శివ ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాకు కోటి కంటే తక్కువ అందుకున్న కొరటాల ఆ తరువాత శ్రీమంతుడు సినిమాతో రెమ్యునరేషన్ డోస్ ని ఒక్కసారిగా పెంచేశాడు. ఈ సిపిమాకు కొర‌టాల 3 కోట్లు తీసుకున్న‌డు. రాజమౌళి, త్రివిక్రమ్ తరువాత అత్యదిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల లిస్ట్ లో చేరాడు . జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న కొరటాల అతి తక్కువ కాలంలోనే తన ఆదాయాన్ని 60 కోట్లకు పైగా పెంచుకున్నాడు. అయితే గ‌తంలో రెమ్యునరేషన్ లా కాకుండా లాభాల్లో షేర్స్ ని అందుకోవాలనే డీల్స్ ని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి 33 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నాడు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాలకు షాక్ తగిలింది.

పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను కొరటాల శివ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ‘దేవర’ మూవీకి ఆయన ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటున్నారట. దేవరతో ఫామ్ లోకి వచ్చిన కొరటాల తన తర్వాత సినిమాల పైన కూడా గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం దేవర2కు సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్న కొరటాల.. తర్వాత కూడా మహేష్ లేదా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలకు కూడా భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ అందుకోబోతున్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎవరు ఊహించని రేంజ్ లో బంపర్ హిట్ ఇచ్చి తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: