పదేపదే ఫోన్ కాల్..సమంత నెంబర్ బ్లాక్ చేసి పడేసిన తెలుగు స్టార్ హీరో.. ఏమైంది అంటే..?

Thota Jaya Madhuri
పాపం ..సమంత టైం అసలు బాగోలేదు . నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అప్పటివరకు టైం బాగానే నడిచింది.  ఆ తర్వాత ఆయనకు డివర్స్ ఇచ్చేసింది. అసలు ఎందుకు విడాకులు ఇచ్చిందో.. ఆమెకు నాగచైతన్యకు ఆ దేవుడికి తెలియాలి.  నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంత టైం అసలు బాగోలేదు . పట్టుకున్నదల్లా దరిద్రంగా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నట్టే బ్యాక్ బ్యాక్ ఫాలో అవుతుంది . పక్కాగా చెప్పాలంటే సమంత రేంజ్ సినిమా విడాకుల తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అని మనం మాట్లాడుకోవాలి.


ఖుసి సినిమా హిట్ అయిన .. అది విజయ్ దేవరకొండ - సమంత రొమాంటిక్ సీన్స్ వల్ల హిట్ అయింది . దాంతో పెద్దగా నటన గురించి మాట్లాడుకునే ఛాన్స్ లేదు అంటున్నారు జనాలు . పాపం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆరోగ్యం బాగో లేకపోయినా సరే నటించింది "సిటాడిల్". ఈ సిరీస్ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది అని భావించింది. అయితే ఆమె టైం బ్యాడ్ సిరీస్ అట్టర్ ప్లాప్ అయింది . బాలీవుడ్ జనాలు పక్కన పెడితే అసలు సమంత ఫ్యాన్స్ కే ఈ సిరీస్ నచ్చలేదు . అసలు సమంత ఈ సిరీస్ లో ఎందుకు నటించింది ..? నాగచైతన్య పై కోపమా..? లేక ఆమె టైం బ్యాడా..? అని చెప్పుకునేంత రేంజ్ లో సిరీస్ బాగా డిజాస్టర్ గా మారింది .


అయితే సమంత కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలాకాలం వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగించారు . అయితే వీళ్ళు ప్రేమించే టైంలో చాలా సరదా సరదాగా గొడవలు వేసుకునే వారట . అఫ్ కోర్స్ అందరూ లవర్స్ అలానే  గొడవలు పడుతూ ఉంటారు . అయితే ఒకానొక మూమెంట్లో నాగచైతన్య - సమంతపై కోపంతో ఆమె నెంబర్ కూడా బ్లాక్ చేసేసాడట . తిక్క రేగిన సామ్ ఏకంగా షూటింగ్ స్పాట్ కే వెళ్లిందట. షూటింగ్  టైంలో పదే పదే కాల్ చేసే విసిగిస్తూ ఉండడంతో ఆమె నెంబర్ బ్లాక్ చేసేసాడట చైతూ. దీంతో సమంత చాలా చాలా కోపంగా డైరెక్ట్ గా ఆయన షూటింగ్స్ చేసే ప్లేస్ కి వెళ్లి కారులో కూర్చొని మరి ఆయనను షూటింగ్ నుంచి బయటకు రప్పించిందట. అంత మొండిది సమంత.  పాపం ఇప్పుడు అలాంటి మొండి సమంత ఎలా అనారోగ్యంగా మారిపోయిందో అంటూ ఫీల్ అవుతున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: