సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరాలి అంటే ఎలాంటి మూవీలో నటించాలి అనే దాని కంటే కూడా ఎలాంటి సినిమాలు వదిలి వెయ్యాలో అనేది తెలిసి ఉండాలి అనే వాదనను కొంత మంది బలంగా వినిపిస్తున్నారు. ఎందుకు అంటే ఏదైనా సినిమా ఆఫర్ వచ్చినపుడు ఆ సినిమా కథ విన్నాక ఆ కథతో తెరకెక్కే మూవీ జనాలకు నచ్చుతుందా లేదా అనేది ముందే గ్రహించగలిగే ఆ సినిమా చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోగలిగిన వారు అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు అనే వాదనను కొంత మంది బలంగా వినిపిస్తున్నారు.
ఇకపోతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరోగా జోష్ అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే జోష్ మూవీ కథ మొత్తం పూర్తి అయ్యాక దానిని చాలా మంది కి వినిపించాను. అందరూ సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్నారు. దానితో ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఆ కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారిని వెళ్లి కలిసి కథ మొత్తం చెప్పించాను. ఆయన ఏమి రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మీరు చెప్పిన కథ వర్కౌట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. చరణ్ ఆ కథతో సినిమా చేయడు. మీకు ఆ కథ బాగా నచ్చితే వేరే ఎవరితోనైనా ట్రై చేయండి అన్నాడు.
ఆ తర్వాత నాకు భయం వేసింది. మరి కొంత మంది తో ఆ సినిమా కథను చర్చించాను. అందరూ కూడా సినిమా చేయండి బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు. దానితో నాగార్జునను కలిశాను. కథ చెప్పించాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా జోష్ మూవీ రెడీ అయ్యింది. విడుదల అయ్యాక చిరంజీవి గారు చెప్పినట్లే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఆయన కథల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే మెగాస్టార్ అయ్యాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.