ఈ సంవత్సరం దసరా , దీపావళి పండుగల సందర్భంగా భారీ ఎత్తున సినిమాలు విడుదల అయ్యాయి. కానీ దసరా పండగ సందర్భంగా విడుదల అయిన సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి దసరా పండగకి ఏ సినిమాలు విడుదల అయ్యాయి... ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకున్నాయి. దీపావళి పండుగ విడుదల అయిన సినిమాలు అలాంటి రిజల్ట్ ను తెచ్చుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా మొదటగా తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ మూవీ విడుదల అయింది. ఈ సినిమాకు గొప్ప స్థాయి టాక్ రాలేదు. దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం మూవీ విడుదల అయింది. ఈ సినిమాకు కూడా గొప్ప టాక్ రాలేదు. ఈ మూవీ కూడా యావరేజ్ విజయన్ని అందుకుంది. ఇక సుహాస్ హీరోగా రూపొందిన జనక అయితే గనక సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా ఈ సంవత్సరం దసరా పండగకు చాలా సినిమాలు విడుదల అయిన ఏ మూవీ కూడా గొప్ప ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేదు.
ఇక దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ అనే రెండు తెలుగు సినిమాలు విడుదల కాగా , శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ అనే తమిళ డబ్బింగ్ సినిమా , భగీర అనే కన్నడ డబ్బింగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో తెలుగు సినిమాలు అయినటువంటి క , లక్కీ భాస్కర్ మూవీలకు అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాలు సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. ఇక తమిళ్ డబ్బింగ్ సినిమా అయినటువంటి అమరన్ కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ దూసుకు వెళ్తుంది. భగీర సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఇలా దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో విడుదల అయిన నాలుగు సినిమాల్లో మూడు సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయి.