డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే.. బ్యాక్ గ్రౌండ్ అదుర్స్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు సంబంధించిన మరో అప్డేట్... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారట. ఈనెల 10వ తేదీన... అంటే ఆదివారం రోజున దర్శకుడు క్రిష్ చాలా రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ ను వివాహం చేసుకోబోతున్నాడట.
 

అయితే తాజాగా ఆ గైనకాలజిస్ట్ వివరాలు బయటకు వచ్చాయి.  దర్శకుడు క్రిష్ పెళ్లి చేసుకోబోయే.. అమ్మాయి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి  చల్ల. ఈ ప్రీతి అనే డాక్టర్ తోనే దర్శకుడు క్రిష్... పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. అయితే ఆదివారం రోజున రహస్యంగా పెళ్లి చేసుకొని... రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈనెల 16వ తేదీన...  హైదరాబాద్ మహానగరంలోని గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని దర్శకుడు క్రిష్ అనుకుంటున్నారట.
 

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతరులను ఈ ఫంక్షన్కు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ దర్శకుడు  క్రిష్... తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2016 సంవత్సరంలో క్రిష్ మొదటి వివాహం జరిగింది. రమ్య అనే డాక్టర్ తోనే క్రిష్ జాగర్లమూడి  మొదటి వివాహం జరిగింది.
అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల... దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, రమ్య విడాకులు తీసుకున్నారు. 2016 లో పెళ్లి జరిగితే 2018లో విడిపోయారు. అయితే అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న దర్శకుడు క్రిష్... ఇప్పుడు ప్రీతి అనే డాక్టర్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రీతికి 12 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇద్దరికీ రెండవ వివాహం అన్నమాట. ఇరు కుటుంబాల సమక్షంలోనే క్రిష్ వివాహం జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: