'పాండురంగడు'గా మెప్పించలేకపోయిన బాలయ్య..భక్తి కంటే రక్తే ప్రధాన లోపమా.?

FARMANULLA SHAIK
'జై బాలయ్య'.. అని వినబడితే చాలు నందమూరి అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్ వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా వెండితెరపై బాలయ్య తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. మాస్ హీరోగా ఎంత పాపులర్ అయ్యారో.. అంతే వైవిధ్యమైన జోనర్ సినిమాలను చేస్తూ వచ్చారు. లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా అరంగేట్రం చేసినా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను బాలయ్య సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు చేసిన బాలయ్య.. పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఎన్టీఆర్ తర్వాత తన జనరేషన్‌లో పౌరాణిక, జానపద, చరిత్రాత్మక, భక్తిరస, సైన్స్ ఫిక్షన్, సాంఘిక చిత్రాలు చేసిన ఏకైక కథానాయకుడు బాలకృష్ణ మాత్రమే.ఈ నేపథ్యంలో బాలయ్య పౌరాణిక చిత్రాల్లో పాండురంగడు ప్రత్యేకమైనది.

అదెలాగంటే ఒకే చిత్రంలో అటు భగవంతుడు, ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగు నాట ఎన్టీఆర్‌, బాలకృష్ణలకే దక్కింది. 1964లో వచ్చిన 'శ్రీ సత్యనారాయణ మహత్మ్యం'లో ఎన్టీఆర్‌ శ్రీ మహా విష్ణువుగా, సత్యవ్రతుడిగా నటించారు. అలాగే 'పాండురంగడు'లో బాలయ్య శ్రీకృష్ణ, పుండరీక పాత్రలతో మెప్పించారు. బాలకృష్ణ ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో కాలేదు. ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయింది.ఇదిలావుండగా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా తన తండ్రి దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం రాత్రి పడుకునే ముందు తన తండ్రి సినిమాలు చూస్తూ పడుకుంటారు. ఇదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పౌరాణిక చిత్రాలకి పెట్టింది పేరు నందమూరి ఫ్యామిలీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాలకృష్ణ కి ఉన్న ఆ ఇంట్రెస్ట్ ‘పాండురంగడు’ అనే చిత్రం చేయడానికి కూడా దోహదపడింది.కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యంతో అలరించారు బాలకృష్ణ. 2008వ సంవత్సరం మే 20న ఈ చిత్రం విడుదలైంది.ఇది కూడా నంద‌మూరి తార‌క రామారావు న‌టించిన పాండురంగ మ‌హాత్మ్యం (1957) స్ఫూర్తితో తెర‌కెక్కిన చిత్రమే.
 శ్రీ కృష్ణుడిగా, పుండ‌రీక రంగ‌నాథునిగా బాల‌య్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్ర‌ల్లో కనిపించారు.ఇదిలావుండగా నాగార్జునతో ‘శ్రీరామదాసు’ అనే చిత్రాన్ని చేసి సూపర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కేంద్రుడు బాలయ్య వంటి పౌరాణిక చిత్రాల్లో ఆరితేరిన హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి.పాండురంగడు’ మూవీ పై కూడా అలాగే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాలో భక్తి కంటే రక్తి ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపించాయి. స్నేహ‌, టబు ,అర్చ‌న‌, మేఘ‌నా నాయుడు వంటి భామలు నటించిన ఈ చిత్రంలో గ్లామర్ కు లోటు ఉండదు. కానీ సగటు ప్రేక్షకుడిని అలరించే అంశాలు తక్కువయ్యాయి. దీంతో సినిమా ప్లాప్ అయ్యింది.అయితే ఈ చిత్రానికి కీర‌వాణి అందించిన బాణీలు అందరినీ అలరించే విధంగా ఉంటాయి.ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: