తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలలో నటించి తెలుగు సినిమా క్యాతిని దశ దిశల వ్యాపింప చేశాడు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది. ఆయన తన కెరియర్లో ఎన్నో పౌరాణిక పాత్రలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మాస్ పాత్రలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో పౌరాణిక పాత్రలలో అంతకుమించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక నేపథ్యం కలిగిన సినిమాల్లో నటిస్తున్నాడు అంటే చాలు ఆ సమయంలో ప్రేక్షకులు ఆ మూవీలపై అత్యంత భారీ ఎత్తున అంచనాలు పెట్టుకునేవారు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా దాన వీర శూర కర్ణ అనే ఒక పౌరాణిక సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. అలాగే ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ఎంతో మంది గొప్ప గుర్తింపు కలిగిన నటీనటులు ఇందులో నటించారు. దానితో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి ఏర్పడ్డాయి. 1977 సంవత్సరం జనవరి 14 వ తేదీన అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఆ సమయంలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీతో సీనియర్ ఎన్టీఆర్ నటనలోనే కాదు దర్శకత్వంలో కూడా టాప్ డైరెక్టర్లకు ఏమాత్రం తీసుకోడు అనే పేరును సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఈ మూవీ లో కర్ణునిగా , దుర్యోధనునిగా , కృష్ణునిగా మూడు పాత్రను పోషించాడు.
మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల ఈ మూవీలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ఇక ఈ మూవీలోని నటనకు గాను , ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాని ఎన్టీఆర్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. నందమూరి హరికృష్ణ , ధూళిపాల , నందమూరి బాలకృష్ణ , కైకాల సత్యనారాయణ , శారద , ప్రభ , ఎస్.వరలక్ష్మి చలపతిరావు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.