ఎన్టీఆర్ లా ప్రభాస్ రాముడు అవుతాడనుకున్నారు.. కానీ చివరికి చేదు అనుభవమే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో రాముడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నటసార్వభౌముడు ఎన్టీఆర్ మాత్రమే. అప్పట్లో కృష్ణడిగా రాముడిగా ఆయన పోషించిన పాత్రలు.. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోసిన తీరు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. అందుకే ఇక ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో రాముడి పాత్ర అనే పేరు వినిపించింది అంటే చాలు ప్రతి సినీ ప్రేక్షకుడికి సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నేటితరంలో మాత్రం స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్న ఇలా రాముడి పాత్ర పోషించేందుకు మాత్రం ఎవ్వరు ధైర్యం చేయలేదు. ఇలాంటి సమయంలో అటు టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఏకంగా రామాయణంతో మరోసారి ప్రేక్షకులను పలకరించాలని సిద్ధమయ్యాడు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఆది పురుష్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కి భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఒకప్పుడు ప్రేక్షకులకు రాముడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుండిపోయారో.. ఇక నేటితరం ప్రేక్షకులకు ఆది పురుష్ సినిమాతో రాముడు అంటే ప్రభాస్ గుర్తుండిపోతాడు అని అభిమానులు అనుకున్నారు.

 ఇలా ఆది పురుష్ అనే టైటిల్ తో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చివరికి ప్రభాస్ ను అభాసుపాలు చేసింది. ఏకంగా రాముడి వేషధారణను అవహేళన చేసే విధంగా దర్శకుడు ఈ సినిమాలో రాముడి పాత్రను డిజైన్ చేశాడని.. కేవలం రాముడి పాత్రను మాత్రమే కాదు పూర్తిగా రామాయణాన్నే తప్పుగా చూపించారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వందల కోట్ల బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఫ్లాప్ అవటం ఒక ఎత్తైతే చివరికి ఈసినిమాపై వచ్చిన విమర్శలు మరో ఎత్తు. ఇలా నేటితరం ప్రేక్షకులకు ప్రభాస్ రాముడిగా మిగిలిపోతాడు అనుకుంటే చివరికి ప్రభాస్ కే ఈ సినిమా ఒక చేదు అనుభవంలా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: