శివుని అవతారంలో చిరంజీవి..మంజునాథతో కొత్త ప్రయోగం ?

Veldandi Saikiran
ఇండస్ట్రీలో సాంఘిక చిత్రాల వెల్లువలో పౌరాణిక, జానపద, భక్తిరస సినిమాలకు కాలం చెల్లిన మాట నిజమే. అయితే అప్పుడప్పుడు కొంతమంది ఆయా చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి ఉంది అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఆ కొవకు చెందిన భక్తిరస చిత్రమే "శ్రీ మంజునాథ". మెగాస్టార్ చిరంజీవి, అర్జున్ నటించిన సినిమా శ్రీ మంజునాథ. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటి లింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

అక్కడ ఉండే ధర్మస్థల క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ దేవుడు శ్రీ మంజునాథునిగా విశేష పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కించిన చిత్రమే శ్రీ మంజునాథ. శివునిగా చిరంజీవి, భక్తునిగా అర్జున్ ఈ సినిమాలో నటించారు. 2001 జూన్ 22న విడుదలైన ఈ సినిమా భక్తకోటిని ఆకట్టుకుంది. శ్రీ మంజునాథ చిత్రంలో చిరంజీవి శివునిగా పూర్తిస్థాయి తన పాత్రను పోషించాడు.

అంతకుముందు పార్వతీ పరమేశ్వరులు చిత్రంలో "నాదనిలయుడే శివుడు"పారలతో తొలిసారి చిరంజీవి స్క్రీన్ పై కనిపించారు. ఆ తర్వాత ఆపద్బాంధవుడు లోని "అవతరించుము దేవరా గిరి సుతా హృదయేశ్వరా" పాటలోను శివుని పాత్రలో అలరించారు. ఇక యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ఈ సినిమాలో భక్త శిఖామని మంజునాథునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మీనా పార్వతీ దేవిగా నటించింది. అంతేకాకుండా సౌందర్య, సుమలత, అంబరీష్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ప్రవీణ్ గౌడ్, ఆనంద్, మాస్టర్ ఆనంద్, కుమార్ గోవింద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

కథ, మాటలు నారా భారతీదేవి సమకూర్చారు. హంసలేఖ సమర్పణలో చిన్ని ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన శ్రీ మంజునాథ సినిమా కథ మాటలు జె కే బారవి సమకూర్చారు. హంసలేఖ స్వరకల్పనకు వేదవ్యాస, చంద్రబోస్, భువనచంద్ర, జొన్నవిత్తుల, సామవేదం షణ్ముఖ శర్మ, విశ్వనాథ శాస్త్రి పాటలు రాశారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నిర్మాతగా నారా జయ శ్రీ దేవి వ్యవహరించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: