ఎన్టీఆర్ - రామ్ చరణ్ కారణంగా.. ఆ పాన్ ఇండియా హీరోకి అంత పెద్ద బొక్క పడిందా..?

Amruth kumar
ప్రస్తుతం మన సౌత్ చిత్ర పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోలు ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేర్లు ప్రభాస్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్. వీరి సినిమాలు టాలీవుడ్ రేంజ్ ని ఎప్పుడో మించిపోయాయి. ప్రభాస్ స్టార్ స్టేటస్ అయితే రజనీకాంత్ , షారుక్ ల‌ను కూడా మించిపోయింది. అయితే వీరందరికంటే ముందు సౌత్ ఇండియాలో తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం మరియు హిందీ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సూర్య. గతంలోని ఈయన సినిమాలు ఓపెనింగ్స్ రజినీకాంత్ తో సమానంగా ఉండేవి. కోలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. సౌత్ లో ఉన్న మిగిలిన అన్ని భాషల ఆడియన్స్ కూడా సూర్య‌ ని తమ సొంత హీరోగా భావించేవారు.

అలాంటి సూపర్ స్టార్ ఇమేజెస్ ని తెచ్చుకున్న సూర్య మధ్యలో కొన్ని డిజాస్టర్లు కారణంగా బాగా డౌన్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా కంగువా సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. నవంబర్ 14న కంగువా సినిమాతో సూర్య ప్రక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది .. ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చాడు. ఇక అందులో రాజమౌళి మాట్లాడుతూ గతంలో సూర్యాతో సినిమా చేసే అవకాశం వచ్చింది .. నా దురదృష్టం కొద్ది మిస్ అయింది భవిష్యత్తులో మళ్ళీ మీతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తుంది అని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

అయితే ఇంతకీ సూర్య రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయినా సినిమా మరి ఏదో కాదు మగధీర ఈ కథ ముందుగా రాజమౌళి సూర్యకు చెప్పాడట. అయితే అప్పట్లో ఈ కథ ఎందుకో సెట్ కాలేదు .. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం క్యారెక్టర్ కోసం ముందుగా సూర్యాని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టడం తో ఆ క్యారెక్టర్ కూడా మిస్ అయింది .. అలా రామ్ చరణ్ - ఎన్టీఆర్ కారణంగా సూర్య రెండుసార్లు రాజమౌళితో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయాడు . అయితే ఈ రెండు సినిమాలు సూర్య ఒప్పుకుని చేసి ఉంటే మాత్రం ఈరోజు ఆయన కెరియర్ మరో లెవెల్ లో ఉండేదని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు . ఇక మరి రాబోయే రోజులైనా సూర్య - రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: