ఆ డిజాస్టర్ డైరెక్టర్ తో అనుష్క సీక్రెట్ మ్యారేజ్..? ఇంతకీ ఫిక్స్ చేసింది ఎవరంటే..!
అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండదు. ఎంతో ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనుష్కకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకటి రెండు పోస్టులు పెట్టిన అవి ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎప్పుడూ ఆమె బయట ఎక్కడ చెప్పదు. అయితే సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రభాస్ , గోపీచంద్ , నాగార్జున , నాగచైతన్య ఇలా అనుష్క పెళ్లి వార్తలపై వీరి పేర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి అనుష్క - ప్రభాస్ పెళ్లి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరిలో ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ కూడా ఉన్నాడు..
ఇంతకీ ఆయన మరెవరో కాదు తెలుగులో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు కే రాఘవేంద్రరావు.. ఆయన తనయుడు ప్రకాష్ కోవెలమూడితో అనుష్క పెళ్లి అనే వార్తలు రావడం విశేషం. ఆయనతో ఏకంగా అనుష్క పెళ్లికి రెడీ అయిందని రహస్యంగా మ్యారేజ్ కూడా చేసుకుందినే వార్తలు బయటకు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సైజ్ జీరో అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారు ప్రేమలో పడ్డారని 2020లో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారని రూమర్లు వచ్చాయి. ఆ రూమర్స్ బాగా వినిపించిన నేపథ్యంలో దీనిపై అనుష్క స్పందించింది. మ్యారేజ్ రూమర్స్ ని ఖండించింది. ప్రకాష్ కోవెలమూడితో మ్యారేజ్ అనే విషయాన్ని ఆమె కొట్టిపారేసింది. రూమర్స్ ని నమ్మవద్దు అని తెలిపింది. అంతేకాదు ఇలాంటి పుకార్లు తనని ప్రభావితం చేయలేవని అనుష్క స్పష్టం చేయడం విశేషం. ఇదిలా ఉంటే అనుష్క.. ప్రకాష్ కోవెలమూడితోపాటు ఓ దుబాయ్‌కి చెందిన బిలియనీర్‌ని కూడా మ్యారేజ్ చేసుకోబోతుందనే రూమర్స్ వచ్చాయి. అరెంజ్ మ్యారేజ్‌గా ఇది ఉండబోతుందని అన్నారు. కానీ దీనిపై అనుష్క గానీ, వారి ఫ్యామిలీగానీ స్పందించలేదు. అనుష్క మ్యారేజ్ రూమర్లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.