ఆ స్టార్ డైరెక్టర్ టార్చర్ భరించలేక.. షూటింగ్లో నిద్ర మాత్రలు మింగిన సౌందర్య..!

Amruth kumar
దివంగత నటి సౌందర్య గురించి కొత్త గా పరిచయం అక్కర్లేదు . సౌత్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే  ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వేలిగింది .. తన సహజ నటనతో ఎంతో మంది అభిమానుల ను సంపాదించుకుంది . చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలు అందరి తో నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది . కన్నడ , మలయాళం , హిందీ భాష ల్లో కూడా సినిమాల్లో నటించి మెప్పించారు సౌందర్య . దాదాపు ఆమె కెరియర్ లో 100 సినిమాలకు పైగా సౌందర్య నటించి  మంచి పేరు తెచ్చుకున్నారు . దురదృష్ట వశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయారు .

సినిమాల్లో ఆమె నటించే పాత్రకు ఆమె డెడికేషన్ ఓ రేంజ్ లో ఉండేది ఎంతో సహనంతో ఓర్పుతో ఆమె సినిమాల్లో నటించేది . ఇక సౌందర్య అప్పట్లో కన్నడ లో ఒక స్టార్ హీరో సినిమా లో నటించింది . అయితే ఆ సినిమా షూటింగ్లో ఆ స్టార్ హీరో కి సంబంధించిన డేట్స్ తక్కువగా ఉండటం వలన షూటింగ్ ఎక్కువ సమయం చేయాల్సి వచ్చేది . డైరెక్టర్ కూడా ఒక్కో షాట్ కి పది టేకులు తక్కువ కాకుండా తీసుకునే వాడట . ఉదయం ఏడు గంటలకి షూటింగ్ కి వస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు షూటింగ్ జరిగేదట .

అయితే సౌందర్య కి పగలు నిద్రపోయే అలవాటు లేకపోయే సరికి ఎంత నిద్రపోవాలని చూసిన నిద్ర పట్టేది కాదట ..  అప్పుడు సౌందర్య కి నిద్రలేమి సమస్య వచ్చింది .. ఆ సమయంలో ఆమె నిద్రపోవడం కోసం తక్కువ మోతాదు లో నిద్ర మాత్ర లు వేసుకుని నిద్రపోయేద‌ట .. మళ్లీ వెంటనే నిద్ర నుంచి షూటింగ్ కి వెళ్ళలేదట షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు సౌందర్య ఎంతో టార్చర్ చూసిందట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: