ఇండియన్ 3 : వామ్మో.. మళ్ళీ షూటింగ్.. ప్రేక్షకులపై రివేంజ్ ప్లాన్ చేసిన శంకర్..!!

murali krishna
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన “ఇండియన్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా తెలుగులో ‘’భారతీయుడు “ అనే టైటిల్ తో విడుదలయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారనే విషయం తెలియడంతో ప్రేక్షకులు సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటిగా  సూపర్ హైప్ తెచ్చుకున్న ‘ఇండియన్-2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం అందుకుంది..శంకర్ కెరీర్లోనే ఇంత పేలవమైన సినిమా మరొకటి రాలేదు... అనవసరంగా ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ చేసి చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్-2 డిజాస్టర్ కావడంతో ఇండియన్-3 పరిస్థితి ఏంటా అనే అయోమయం  మేకర్స్ లో నెలకొంది.నిజానికి ఈ సీక్వెల్‌ను ఒక సినిమాగానే చేయాలనుకున్నారు. కానీ సినిమా చాలా ఆలస్యమవడంతో బడ్జెట్ అమాంతం పెరగిపోయింది.. దీనితో రెండు భాగాలుగా చేసి రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావించారు. కానీ ఇందుకోసం కథను సీరియల్ లాగా సాగదీయడమే ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది.

ఇప్పటికే ‘ఇండియన్-3’ షూట్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో పెట్టిన చిత్ర యూనిట్.. ఇండియన్ 2 ప్లాప్ అవడంతో అయోమయంలో పడింది.. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అయింది..అయితే తాజాగా కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఇండియన్-3’ని మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.. కమల్ హాసన్ చెప్పిన కొన్ని మార్పులు చేర్పులను అనుసరించి మళ్లీ కొంత షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే షూట్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ ‘ఇండియన్-3’ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నారు...‘ఇండియన్-2’ రిలీజ్ టైంలో కూడా ఇండియన్-3 లోని కథే ఈ సినిమా తాను చేయడానికి కారణమని చెప్పారు. దీంతో ‘ఇండియన్-3’నే బాగుంటుందని కమల్ అప్పుడే హింట్ ఇచ్చారు..మరి ఇండియన్ 3 అయినా ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: