ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఆమె.. నిర్మొహమాటంగా చెప్పేసిన అల్లు అర్జున్ ..!

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ ..చాలా చాలా డేరింగ్ హీరో . ఎంతలా అంటే నువ్వు చేసేది తప్పు అంటే తప్పు అని చెప్పేస్తాడు. నువ్వు చేసేది బాగుంది మంచి పనే అంటే శభాష్ అంటూ భుజం తడుతారు . ఈ రోజుల్లో ఇలాంటి హీరోస్ చాలా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఏం మాట్లాడితే ఏం ట్రో చేస్తారో..? మన సినిమాని అడ్డుకుంటారో..? అంటూ భయం భయంగా బిక్కు బిక్కుగా ఉండే హీరోస్ చాలామంది ఉన్నారు. తమ సినిమాకి పబ్లిసిటీ పాపులారిటీ తెప్పించుకోవడానికి బాగా ట్రై చేస్తూ .. పక్క హీరో సినిమాలకి హెల్ప్ చేయరు. అసలు సపోర్ట్ కూడా చేయరు . అలాంటి హీరోస్ ఎంతోమంది ఉన్నారు .


మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక బడా హీరో అయితే బాగా సెల్ఫిష్ గా మారిపోయాడు.  ఎంతలా అంటే ఆయన సినిమా రిలీజ్ ఈవెంట్ అయితేనే వస్తాడు. ఆయన సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడానికి ఇంటర్వ్యూలకి హాజరవుతారు . ఆయన ..ఆయన కుటుంబం అంతే తప్పిస్తే మిగతా హీరోస్ ని సపోర్ట్ చేయరు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? అన్న విషయాలను అస్సలు పట్టించుకోరు . అయితే బన్నీ అలా కాదు చాలా చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ . ఆ విషయం చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది .


అంతేకాదు రీసెంట్గా ఆయన అన్ స్టాపబుల్  షో కి గెస్ట్ గా హాజరయ్యారు. పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ చేస్తున్న షో కి  హాజరైన బన్నీ తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మరి ముఖ్యంగా రష్మిక మందన్నా తో నటించడం ఇష్టమా..? పూజా హెగ్డే తో నటించడం  ఇష్టమా..? అంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు బన్నీ ఇచ్చిన ఆన్సర్ హైలెట్గా మారింది. బాలయ్య ప్రశ్న అడగ్గానే బన్నీ కొంచెం సేపు అటూ ఇటూ చూస్తాడు. ఈలోపు బాలయ్యే.." నేనైతే ఓపెన్ గా చెప్పేస్తా నాకు రష్మిక మందన్నానే ఇష్టం " అంటూ చాలా డేరింగ్ ఆన్సర్ ఇచ్చారు. "నేను కూడా అంతే నాకు కూడా రష్మిక మందన్నా అంటేనే ఇష్టం" అంటూ అల్లు అర్జున్ చెప్పిన తీరు నవ్వులు పూయించింది. అంతేకాదు బాలయ్య - అల్లు అర్జున్ ల మధ్య జరిగిన కాన్వర్జేషన్ షోలో హైలెట్గా మారాయి . పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బయటపడతాయి అంటున్నారు బన్నీ అభిమానులు . ఈ ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: