టాలీవుడ్‌ హీరో ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసిన సమంత ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుసగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకున్నారు.

వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ జంట ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉన్నారు. విడాకుల అనంతరం వీరికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకుల తర్వాత నాగచైతన్య సమంతను బుజ్జగించే ప్రయత్నం చాలా సార్లు చేశాడట.

తనకోసం ఎన్నోసార్లు ఫోన్ కాల్స్ కూడా చేశాడట. కానీ సమంత అప్పటికే విసిగిపోయి తన ఫోన్ లిఫ్ట్ చేయలేదట. మెసేజ్ లు చేసినా కూడా రిప్లై ఇవ్వకుండా చైతు నంబర్ బ్లాక్ చేసిందట. ఈ విషయాన్ని సమంత స్నేహితులు వెల్లడించారు. ఇక కొద్ది రోజుల అనంతరం నాగచైతన్య... నటి శోబితతో ప్రేమలో పడ్డాడు. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారు.

కానీ సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉంది. తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం లేదని, ఎంతో ప్రేమించి, ఇష్టపడి నాగచైతన్యను వివాహం చేసుకున్నానని సమంత చెప్పింది. మరో వ్యక్తికి తన జీవితంలో స్థానం ఇవ్వనంటూ సమంత వెల్లడించింది. ఈ విషయం తెలిసి ప్రస్తుతం సమంత అభిమానులు చాలా బాధపడుతున్నారు. చైతన్య, సమంత కలుస్తారని ఎంతో మంది ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్నారు. ఇక నాగచైతన్య ఎంగేజ్‌ మెంట్‌ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: