ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో కృష్ణ బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

praveen
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ ఎలా అయితే ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా ఉన్నారో.. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు కూడా ఇలాగే ఇండస్ట్రీ ప్రతిష్టను భుజాన వేసుకుని ముందుకు నడిచేవారు. ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక్కో సినిమా చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు అది కూడా ప్రేక్షకులకు అదృష్టం లేకుండా పోతుంది. కానీ ఒకప్పుడు ఏకంగా ఏడాదికి పది సినిమాలు చేస్తూ ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు పోటీ పడుతూ ఉండేవారు అని చెప్పాలి.

 అయితే అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలను ఢీకొడుతూ అప్పట్లో యంగ్ హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృష్ణ సెన్సేషనల్ విజయాలను సాధిస్తూ వచ్చారు. అందుకే ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఏకంగా 20 ఏళ్ల వయసులోనే నటనపై మక్కువతో చిత్రశ్రమలోకి అడుగుపెట్టారు ఆయన. దాదాపు 350 కి పైగా సినిమాల్లో నటించారు అని చెప్పాలి. కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా తన బహుముఖ ప్రతిభను కనబరిచారు.

 అయితే ఓకే ఏడాది ఏకంగా 18 సినిమాల్లో సైతం నటించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సూపర్స్టార్ కృష్ణ ఒకానొక సమయంలో ఎన్టీఆర్ రిజెక్ట్  చేసిన కథనే చేసి చివరికి సూపర్ హిట్ కొట్టారట. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నా అల్లూరి సీతారామరాజు సినిమా మాత్రం ఎంతో ప్రత్యేకం. ఇక ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సైతం తిరగరాసింది. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమే. అయితే ఈ సినిమా అసలు కృష్ణతో తీయాల్సింది కాదట. మొదట డైరెక్టర్ రామచంద్రరావు ఈ సినిమాను ఎన్టీఆర్కు వినిపించాడట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఇక కృష్ణ వరకు ఈ కథ వెళ్ళిందట. ఇక కృష్ణ ఈ సినిమాను చేసి సూపర్ హిట్ కొట్టాడు. అంతే కాదు కృష్ణ కెరియర్ లో ఇది ఒక మైలురాయి లాంటి సినిమాగా నిలిచిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: