కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్గా వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు కొన్ని అనేక ఆసక్తికరమైన విషయాలు జరిగాయట అవేమిటో తెలుసుకుందాం.
వక్కంతం వంశీ తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించాడు. ఇలా కథ రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వంశీ ఆ తర్వాత నేరుగా తన కథతో తానే ఓ సినిమాకు దర్శకత్వం వహించాలి అని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగా తన దగ్గర ఉన్న ఓ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ కథ విని పెద్దగా రెస్పాండ్ కాలేదట. ఇక కథ చెప్పి తిరిగి వస్తున్న సమయం లో వంశీ కి అల్లు అర్జున్ కలిశాడట. దానితో మాటల్లో ఎన్టీఆర్ కి కథను వివరించినట్టు వంశీ , బన్నీ కి చెప్పాడట. కథ నాకు ఒక సారి చెప్పగలరా అని బన్నీ అడగగా ... ఆయన కథ మొత్తం కూడా బన్నీ కి చెప్పాడట. దానితో సూపర్ స్టోరీ ... బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని బన్నీ అన్నాడట. ఇక ఆ తర్వాత వంశీ కి ఎన్టీఆర్ ఫోన్ చేసి ఆ కథతో సినిమా చేయను అని చెప్పాడట.
ఈ విషయం తెలియక ఒక రోజు బండి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి సూపర్ కథ పట్టావు బావ ... సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నాడట. కానీ తారక్ మాత్రం సైలెంట్ గా ఉండి పోయాడట. ఆ తర్వాత తారక్ ఆ సినిమా కథను రిజెక్ట్ చేసినట్లు బన్నీ కి తెలిసిందట. దానితో వంశీకి బున్ని ఫోన్ చేసి నాకు ఆ కథ సూపర్ గా నచ్చింది. నేను ఆ కథతో సినిమా చేస్తాను అన్నాడట. అలా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా సెట్ అయ్యిందట. కానీ బన్నీ ఎంతో నమ్మిన కథ ఆయనకు మాత్రం ఫ్లాప్ ను ఇచ్చింది.