అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. అతని ఎందుకు వదిలేసింది అంటే..?

Amruth kumar
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తున్న పేర్లలో శోభిత దూళిపాళ  కూడా ఒకరు .. ఇక ఈమె నటించింది అతి తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా అనతి కాలంలోనే తనుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగచైతన్య కారణంగా శోభిత దూళిపాళ‌ లైఫ్ ఊహించని రేంజ్ లో మారిపోయింది అని చెప్పాలి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితతో రిలేషన్ మైంటైన్ చేస్తూ వచ్చాడు చైతు. ఈ క్రమంలోనే నాగచైతన్య - శోభిత దూళిపాళ‌ ఎవరు ఊహించిని విధంగా  సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. అతి కొద్ది మంది సమ‌క్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక్కడ నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ఎక్కడ బయట కనిపించలేదు.

ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇక తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్లో అడుగు పెట్టాని ఆ స‌మయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఆమె చెప్పకు వచ్చింది. నేను నల్లగా ఉండటంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ హేలనుగా మాట్లాడే వారిని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా సార్ల ఏడిచానని శోభిత చెప్పకు వచ్చింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ విషయాన్ని పక్కన పెట్టి అందం అనేది అసలు మ్యాటర్ కాదని ఎవరేమనుకున్న తన పని తను చేసుకు వెళ్లిపోవాలని ఆలోచనకు వచ్చి తాను ఆడిషన్ కి వేళ్తు ప్రయత్నాలు చేశానని ఆమె చెప్పకు వచ్చింది. అదే సమయంలో ఆమె తన మొదటి లవ్ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకో వచ్చింది.

ఇక తాను చిన్న వయసులో ఒక అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను కానీ ఆ వ్యక్తి ఎలాంటి అటెన్షన్ చూపించలేదు.. నేను ఎంత ప్రయత్నించినా నా ప్రేమను అతను అంగీకరించలేదు. అతను ఒక స్టుపిడ్ నన్ను చాలా బాధపెట్టాడు అయితే నా ఫస్ట్ ల‌వ్‌ మాత్రం స్కూల్ డేస్ లో జరిగింది.  అతడే నా క్లాస్ కెప్టెన్ .. అతడు అంటే నాకు ఎంతో ఇష్టం ఉండేది.. కానీ అతనికి నేను ఎక్కడా చెప్పలేదు.. నా స్కూల్ డేస్ లో క్రష్ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోయాయి..  కానీ తాను చదువుపైనే దృష్టి పెట్టానని శోభిత చెప్పుకొచ్చింది. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, తెలుగు, తమిళ, హిందీ బాషాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: