కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారు ఉండరు. అయితే అలాంటి ఈ హీరో అసలు మగాడే కాదు అంటూ ఓ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ ఆ జర్నలిస్టు ఎవరు? ఎందుకు అజిత్ పై పగ పట్టినట్లు అలా మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమాల్లో పేరుగాంచిన హీరోలలో అజిత్ కూడా ఒకరు. అయితే అలాంటి ఈ హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఇప్పటికి కూడా తన ఎనర్జీతో ఎంతో మంది కుర్ర హీరోలను కూడా సైడ్ చేస్తున్నారు.అయితే అలాంటి ఈ హీరో హీరోయిన్ శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరూ ఎంతో ఘాడంగా ప్రేమించుకొని డేటింగ్ చేసి ఇరుకుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లాడారు. అయితే వీరి పెళ్లి జరిగాక దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లల్ని కనలేదు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది కామనే. ఎందుకంటే పెళ్లయ్యాక కొద్ది సంవత్సరాలకు పిల్లల విషయంలో ఆలోచన చేసి పిల్లల్ని కంటూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనడానికి సమయం తీసుకుంటారు.
అయితే వీరి విషయంలో కూడా అదే జరిగింది. అజిత్ పెళ్లి చేసుకున్నాక రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. అయితే ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న ఓ జర్నలిస్టు ఏకంగా అజిత్ పర్సనల్ విషయంలో తలదూర్చి పేపర్లో ఒక పెద్ద వార్త రాశారు.. అజిత్ కి వివాహం జరిగి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు ఆయనకు మగతనం ఉందో లేదో అనే సందేహం ఉంది అనే విధంగా తిరైచ్చువై అనే పత్రిక జర్నలిస్టు ఒక సంచలన వార్త రాశారు. అయితే ఈ వార్త అప్పట్లో పెద్ద దుమారమే సృష్టించింది. కానీ ఈ విషయాన్ని అజిత్ అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అజిత్ పై వివాదాస్పదమైన వార్త రాసిన జర్నలిస్టు హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు. కానీ ఆ సమయంలో ఆయనకు 2.5 లక్షల అవసరం ఉంది అని తెలిసిన అజిత్ వెంటనే వెళ్లి హాస్పిటల్లో ఆ డబ్బు మొత్తం కట్టారట.
ఇక ఆ టైంలో మీరు ఎందుకు అలా చేశారు మీపై అంత పెద్ద వార్త రాసారు అని పిఆర్ఓ టీం అడగగా.. ఈ సమయంలో ఆయనపై పగ తీర్చుకోవడం కాదు.బలంగా ఉన్నప్పుడు గొడవపడాలి బలహీనంగా ఉన్నప్పుడు కాదు అంటూ అజిత్ చెప్పారంటూ తమిళ జర్నలిస్టు పాండియన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ విషయం తెలిసిన అజిత్ అభిమానులు మా హీరో ఎంత గొప్పవాడో ఈ ఒక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.తనపై అంత పెద్ద వివాదాస్పద వార్త రాసిన సరే అ జర్నలిస్టుకి కష్ట కాలంలో సహాయం చేశాడు అంటూ మెచ్చుకుంటున్నారు