బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లే ముందు.. గంగవ్వ - నాగార్జునకి మధ్య ఇంత జరిగిందా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇప్పటికే 70 రోజులను పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్బాస్ హౌస్లో కొన్ని కొన్ని సార్లు ఊహించని ఎలిమినేషన్లు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఎలిమినేషన్లలో ఇటీవల శనివారం రోజున గంగవ్వ ఎలిమినేషన్ కూడా ఒకటి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ అనారోగ్య సమస్యల కారణంగా చివరికి హౌస్ నుంచి బయటికి వచ్చింది.

 అయితే అనారోగ్య కారణాలవల్లే అటు గంగవ్వ హౌస్ నుంచి బయటికి వచ్చింది అనే అందరూ అనుకున్నప్పటికీ.. ఆమె ఎలిమినేషన్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి అనే వార్త కూడా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఈ సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ నుంచి పెద్దగా కంటెంట్ వచ్చింది ఏమీ లేదు. టాస్కులు ఆడలేదు. ఇక నామినేషన్ కూడా ఆమె మీద ఎవరు వేయలేదు. ఇలా గంగవ్వ వల్ల షో కి నష్టం తప్ప నయా పైసా ఉపయోగం లేకుండా పోయింది. ఈమెకు బదులుగా గేమ్స్ బాగా ఆడుతూ కంటెంట్ ఇస్తున్న మిగతా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. ఫలితంగా టిఆర్పి కూడా పడిపోతుంది.

 అందుకే గతవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి గంగవ్వని బయటికి పంపించేశారు అనేది తెలుస్తుంది. అయితే ఎలిమినేట్ అవ్వడానికి ముందు టీవీలో అందరికీ చూపించింది ఒకటి అయితే.. ఇక అంతకుముందు నాగార్జున, గంగవ్వకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజీ మొత్తాన్ని బిగ్ బాస్ టీం తొలగించారట. ముందుగా నాగార్జున గంగవతో మాట్లాడుతూ వాస్తవ విషయాలను వివరించి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వాలని ఆదేశించాడట. కానీ గంగవ్వ ఒప్పుకోలేదట. నేను నామినేషన్స్ లోకి రాలేదు. ఒకవేళ వచ్చినా నన్ను ఆడియన్స్ సేవ్ చేస్తారు. నేను బయటికి వెళ్ళను అంటూ చెప్పిందట. నాగార్జున సముదాయించడానికి ప్రయత్నించగా గంగవ్వ తన కోడలికి ఇల్లు కట్టిస్తా అని మాటిస్తే బయటికి వస్తాను అని చెప్పిందట.  నాగార్జున అందుకు ఒప్పుకోలేదట. ఇక ఇలా కాసేపు వాగ్వాదం జరిగిందట. చివరికి నాగార్జున గంగవ్వను ఒప్పించి సెల్ఫ్ ఎలిమినేట్ చేసేసారట. అయితే గంగవ్వ ఇలా వాగ్వాదానికి దిగడంతో నాగార్జున నిరాశకు గురయ్యాడని.. అందుకే కనీసం గంగవ్వను స్టేజి మీదకి కూడా పిలవలేదు అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: