సంక్రాంతికి వస్తున్నాం : అప్పుడే టేబుల్ ప్రాఫిట్.. వెంకీ క్రేజ్ మామూలుగా లేదుగా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా ఎఫ్ 2 అనే సినిమా వచ్చింది. ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో ఎఫ్ 3 అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ సోలో హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన వెలుబడలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం వెంకటేష్ 20 కోట్లు , అనిల్ రావిపూడి 30 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో 50 కోట్లలో సినిమా మొత్తం కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు 75 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు  , నాన్ ద్రియేటికల్ బిజినెస్ మరో 35 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. దానితో ఈ సినిమా ఇప్పటికే ఐదు కోట్ల టేబుల్ ప్రాఫిట్ ను అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: