తమిళ స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా కనిపించాడు. తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించగా ... కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి జోడిగా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమా పెద్ద మొత్తంలో కలక్షన్లను వసూలు చేయడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్ల గొట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే విజయ్ ఇప్పటికే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రస్తుతం తలపతి 69 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ లో మరో కీలకమైన ఫిమేల్ పాత్ర ఉందట.
దానిలో సమంత ను తీసుకోవాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే విజయ్ హీరోగా రూపొందిన కత్తి , తేరి , మేర్సిల్ సినిమాలలో సమంత హీరోయిన్గా నటించింది. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక వీరి కాంబోలో నాలుగవ సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.