త్రివిక్రమ్ పెళ్లి చూపుల ప్రేమ కథ భలే ఉందిగా.. టాలీవుడ్ క్యూట్ కపుల్ అంటూ?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపు ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ మెప్పు పొందడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ భవిష్యత్తు సినిమా బన్నీ హీరోగా తెరకెక్కనుండగా మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం.
 
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 400 కోట్ల రూపాయల కంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే బన్నీ భార్య పేరు సౌజన్య అనే సంగతి తెలిసిందే. 2002 సంవత్సరంలో త్రివిక్రమ్ సౌజన్య వివాహం జరిగింది. త్రివిక్రమ్ మొదట పెళ్లి చూపులకు వెళ్లగా పెళ్లి చూపుల్లో అక్కకు బదులుగా చెల్లి నచ్చారు. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పించారు.
 
సౌజన్య అక్కకు పెళ్లి జరిగిన తర్వాతే తాము పెళ్లి చేసుకుంటామని చెప్పి త్రివిక్రమ్ మంచి మనస్సును చాటుకున్నారు. సౌజన్య విషయానికి వస్తే ఈమె సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు కావడం గమనార్హం. సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్ కాగా ప్రస్తుతం ఫోర్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ద్వారా సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు.
 
మొదట ఈ బ్యానర్ కు భారీ విజయాలు దక్కకపోయినా తర్వాత రోజుల్లో మాత్రం మంచి విజయాలు దక్కాయి. బాలయ్య బాబీ కాంబో సినిమాకు సైతం సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో సౌజన్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: