ప్రియాంక దత్ ని బుట్టలో పడేయడానికి నాగ్ అశ్విన్ అలాంటి ప్లాన్ చేశారా..?

Pandrala Sravanthi
- కల్కి మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా..
- స్టార్ నిర్మాత కి అల్లుడిగా..
- ప్రియాంక దత్-నాగ్ అశ్విన్ ల లవ్ స్టోరీ..

 ప్రభాస్ హీరోగా..దీపికా పదుకొనే హీరోయిన్ గా.. కమల్ హాసన్ విలన్ గా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో భారీ తారాగణంతో విడుదలైన కల్కి 2898 ADమూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత అందరూ ఈ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే మాట్లాడుకున్నారు. అయితే అలాంటి నాగ్ అశ్విన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. మరి అలాంటి ప్రముఖ దర్శకుడి లవ్ స్టోరీ ఏంటి.. ఆయన ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం..
 నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ:
సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్న నాగ్ అశ్విన్ ఎడిటర్ అవుతారని అనుకున్నారట. కానీ సడన్ గా ఆయన డైరెక్టర్ గా మారిపోయారు. ఇక డైరెక్టర్ గా మారకముందు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆ అనుభవంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. ఇక మొదటిసారి ఈయన దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమా కంటే ముందే నాగ్ అశ్విన్ యాదోం కీ భారత్ అనే షార్ట్ ఫిలిమ్ ని ఇంగ్లీష్ లో తెరకెక్కించారు. అయితే ఈ షార్ట్ ఫిలిం కి ప్రొడ్యూసర్గా ప్రియాంక దత్ చేసింది. అయితే ఈ షార్ట్ ఫిలిం మంచి హిట్ అవ్వడంతో ఆ తర్వాత నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీ ప్రియాంక స్వప్నలకి చెప్పారట.అయితే ఈ స్టోరీ నచ్చిన ప్రియాం, స్వప్న దత్ లు ఇద్దరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేస్తామని ముందుకు వచ్చారు.

 అలా ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. అయితే ఆ టైంలో ప్రియాంక దత్ కి పెళ్లి చేయాలని అశ్వినీ దత్ అనుకొని పెళ్లి సంబంధాలు చూశారట. అయితే ఈ విషయం తెలుసుకున్న నాగ్ అశ్విన్ ఓసారి ప్రియాంక దగ్గరికి వెళ్లి మీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని విన్నాను. ఒకవేళ మీకు వాళ్లు నచ్చితే ఓకే కానీ నచ్చకపోతే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ఒకే ఒక్క మాటతో ప్రియాంకదత్ ని బుట్టలో పడేసాడట. ఇక ఆ తర్వాత అశ్వినీ దత్ ని ఒప్పించడానికి  ఎన్నో తంటాలు పడ్డారు.ఎందుకంటే వీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ముఖ్యంగా అశ్విని దత్ కులం అంటే కోసుకుంటాడు.అలాంటి కుల పిచ్చి ఉన్న అశ్విని దత్ ని ప్రియాంక నాగ్ అశ్విన్ లు తమ ప్రేమ బంధంతో ఒప్పించారు. అలా 2015లో వీరి పెళ్లి జరిగింది.అయితే నాగ్ అశ్విన్ ప్రియాంక ని ఎలా లవ్లో పడేసాడో ఓ ఇంటర్వ్యూ చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: