పెళ్లై కొడుకున్న అమ్మాయితో లవ్‌...రాజమౌళి లవ్‌ స్టోరీ అదుర్స్‌ ?

Veldandi Saikiran
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అదే రేంజ్ లో రాజమౌళి తీసే ప్రతి ఒక్క సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. రాజమౌళి చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం రాజమౌళి వరుస సినిమాలతో కాస్త లేట్ అయినా సరే మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాడు.

ఇక రాజమౌళి వ్యక్తిగత విషయానికి వస్తే.... రాజమౌళి రమ అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రమకు అంతకుముందే వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి కార్తికేయ అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొద్ది రోజులకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో రమ తన కుమారుడితో వేరుగా ఉండడం మొదలుపెట్టింది. కీరవాణి, రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల కుమారులు. రమ కీరవాణి భార్య వల్లి సోదరి. రాజమౌళికి దగ్గర బంధువు కావడంతో వీరిద్దరి మధ్య సాధారణంగా పరిచయం ఏర్పడింది.

రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడిగా ఉన్న సమయంలో శాంతి నివాసం సీరియల్ కు దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేస్తున్న సమయంలో రమ, రాజమౌళి మధ్య ప్రేమ చిగురించింది. ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసిన రాజమౌళి ఆమెను వివాహం చేసుకోవడానికి ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించారు.

అయితే సినీ కుటుంబం కావడంతో హడావిడిగా పెళ్లి చేసుకోకుండా సాదాసీదాగా రాజమౌళి, రమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా కార్తికేయను రాజమౌళి తన సొంత కుమారుడి కన్నా ఎక్కువగానే చూసుకుంటూ వచ్చాడు. కాగా, రాజమౌళి, రమకు మొదట ప్రపోజ్ చేయగా ఆమె ఒప్పుకోలేదట. సంవత్సరం తర్వాత కూడా రాజమౌళి అలానే పట్టు పట్టడంతో రమ ఓకే చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: