"బొమ్మరిల్లు భాస్కర్" లవ్ లో స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. తండ్రిని ఎదిరించి మరీ..?

Pandrala Sravanthi
-బొమ్మరిల్లు మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్..
- బొమ్మరిల్లు భాస్కర్ గా ఇండస్ట్రీలో ఫేమస్..
- బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీ..

కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు వాళ్ళు నటించిన లేదా తెరకెక్కించిన లేదా నిర్మాతగా చేసిన సినిమాల ద్వారా ఫేమస్ అయిపోతారు. దాంతో ఆ సినిమాల పేరునే తమ ఇంటి పేర్లుగా మార్చుకుంటారు. అలా దిల్ రాజు,అల్లరి నరేష్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి సెలబ్రిటీలు ఉన్నారు.అయితే వీరిలో బొమ్మరిల్లు భాస్కర్ గురించి చెప్పుకుంటే ఈయన సిద్ధార్థ్,జెనీలియా హీరో హీరోయిన్లుగా చేసిన బొమ్మరిల్లు మూవీకి మొదటిసారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాల కంటే ముందే భద్ర,ఆర్య వంటి మూవీస్ కి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. కానీ మొదటిసారి దర్శకుడిగా బొమ్మరిల్లు సినిమా చేశారు.అయితే మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.దాంతో ఈ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే అలాంటి స్టార్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీ ఏంటి? ఆయన తండ్రిని ఎలా ఎదిరించారు అనేది ఇప్పుడు చూద్దాం..
బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీ:

 సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ మొదటిసారి బొమ్మరిల్లు మూవీ కి దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా మారారు. ఆ తర్వాత బన్నీతో పరుగు మూవీ తీసి హిట్ కొట్టారు. ఇక ఈ మూవీ తర్వాత ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవ్వగా.. రామ్ పోతినేని తో చేసిన ఒంగోలు గిత్త మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.దాంతో ఈ డైరెక్టర్ హవా ఇండస్ట్రీలో తగ్గిపోయింది. కానీ ఆ తర్వాత అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ హిట్ అవ్వడంతో మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్ కం బ్యాక్ అయ్యారు. ఇక ఈయన సినీ కెరియర్ పక్కన పెడితే బొమ్మరిల్లు భాస్కర్ గౌరీ శ్రీవిద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గౌరీ శ్రీ విద్యను ప్రేమించిన తొమ్మిది నెలల్లోనే పెళ్లి చేసుకున్నారు. అది కూడా తల్లిదండ్రులను ఎదిరించి..

అయితే బొమ్మరిల్లు భాస్కర్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఆయన తండ్రి కేవలం పది రోజుల్లోనే పెళ్లి చేస్తాను అనిఒక సంబంధం ఫిక్స్ చేసి టైం పెట్టారట. కానీ భాస్కర్ మాత్రం ఇప్పుడు పెళ్లికి అంత తొందరేం వచ్చింది అన్నారట. ఎందుకంటే అప్పటికే భాస్కర్ గౌరీతో ప్రేమలో ఉన్నారు. కానీ తండ్రి పెళ్లి విషయంలో ఇబ్బంది పెట్టడంతో వెంటనే అరసవెల్లి వెళ్లి నాన్న నేను అరసవెల్లి లో ఉన్నాను.మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి.నేను గౌరీ శ్రీవిద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను.ఇప్పుడే పెళ్లి అంటూ పెద్ద షాకిచ్చారట. ఇక కొడుకు ఇచ్చిన షాక్ కి భాస్కర్ తండ్రి చాలాసేపటి వరకు షాక్ లో మునిగిపోయారట. అలా గౌరీ శ్రీవిద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ కి హాసిని అనే అమ్మాయి పుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: