ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన అనుష్క..ఇక నోర్లు మూయండి రా బాబులు..!
అనుష్క శెట్టి ఒక పెళ్లయి పిల్లలు ఉన్న హీరోని ప్రేమించింది అని.. ఆయనతో బాగా రాసుకొని పూసుకుని తిరగడం కారణంగానే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంది అని చాలా చాలా నీచంగా కొంతమంది ఆమెను ట్రోల్ చేశారు . అయితే ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని అస్సలు అనుకోలేదట. ఆమె యోగ టీచర్ గా సెటిల్ అవ్వాలి అంటూ అనుకునిందట. ఊరికే సరదాగా సూపర్ సినిమాకి ఆడిషన్ ఇచ్చిందట . అనుకోకుండా ఆ సినిమాలో సెలెక్ట్ అయిపోయిందట.
ఆ తర్వాత కూడా అనుష్క హీరోయిన్గా ఎక్కడ కూడా సినిమాలు మనసు పెట్టి చేయలేదట.. అంతగా మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపించలేదట . వచ్చిన ఆఫర్స్ ను సైలెంట్ గా యాక్సెప్ట్ చేస్తూ తన పని తాను చేసుకోపోయిందట . మరి ముఖ్యంగా ఒకానొక ఇంటర్వ్యూలో అసలు తనకు హీరోయిన్ అవ్వాలని లేదు అని .. సౌందర్య గారిని చూసిన తర్వాతే తన మనసులో ఎక్కడో ఆ కోరిక పుట్టింది అని చెప్పుకొచ్చింది అనుష్క . దీంతో సోషల్ మీడియాలో అనుష్క పేరు మారు మ్రోగిపోతుంది . ఇకనైనా అనుష్కను ట్రోల్ చేసే వాళ్ళు నోరు మూయండిరా.. ఆమె ఎటువంటి కమిట్ అవ్వలేదు.. కమిట్మెంట్ ఇవ్వలేదు.. సౌందర్య గారి వల్ల ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చింది అంటూ అనుష్క కి సపోర్ట్ చేస్తున్నారు స్వీటీ ఫ్యాన్స్..!