ఎంజాయ్ చేయడమంటే చాలా ఇష్టమంటూ బాంబ్ పేల్చిన బాలయ్య బ్యూటీ.!

FARMANULLA SHAIK
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ హనీరోజ్. కానీ ఆ తర్వాత వచ్చిన క్రేజ్ కాపాడుకోలేకపోయింది. నందమూరి నటసింహం వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ఈ కేరళ కుట్టింది. ఇందులో బాలయ్య భార్యగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో తెలుగులో మరిన్న ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ ఈ మూవీ తర్వాత హనీ ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకలలోనే కనిపించింది. వీరసింహారెడ్డి తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు మాల్స్ ఓపెనింగ్ వీడియోస్, ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. చీరకట్టులోనే అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సినిమాలు చేయకపోయినా అటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఇదిలావుండగా   తాజాగా ప్రారంభోత్సవాలకు వెళ్లడంపై హనీ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివాహాలకు హాజరవడం కంటే ప్రారంభోత్సవాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతానని హనీ చెప్పింది. దాంతో అందరూ అవాక్ అవుతున్నారు. ఓపెనింగ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తా.. మన కోసం ఎదురుచూసే జనాలను చూడటం , వారి ప్రేమను పొందడం నాకు చాలా ఇష్టం. మేము ప్రారంభించబోయే దుకాణం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది. వెల్ కమ్ చెబుతూ ఆయన ప్రారంభించే సంస్థకు మమ్మల్ని ఆహ్వానించడం ఓ విశేషం. నాకు ఆ వైబ్ అంటే చాలా ఇష్టం. కానీ అందరితో కలిసి పెళ్లికి వెళ్లడం నాకు చాలా కష్టం. అవార్డు షోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయితే ప్రారంభోత్సవానికి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలని నాకు అనిపించదు అని చెప్పుకొచ్చింది హనీ రోజ్. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా ఇప్పటివరకు సినిమాల్లో కథానాయికగా అలరించిన హానీరోజ్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించనుంది. హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: