అనుష్క షాకింగ్ డిసిషన్.. సన్యాసిగా మారిపోతుందట.. యోగ టీచర్ ముందే చెప్పింది గా..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటుంది. బాహుబలి తర్వాత ఆమె సినిమాల జోరు బాగా తగ్గింది. ఇంక కరెక్ట్ గా చెప్పాలంటే సైజ్ జీరో తర్వాత ఆమె సినిమాల్లో నటించడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. అందుకు కారణం ఆమె బరువు ఈ సినిమా కారణంగా అనారోగ్య సమస్యలను ఆమె ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక దాంతో అనుష్క సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతూ వచ్చింది. తన బరువుని కంట్రోల్ చేసుకుని సినిమాలు చేయడం ఆమెకు పెద్ద సవాల్ గా మారింది. అందుకే అనుష్క సినిమాలు విషయంలో ఎంతో సెలెక్టివ్గా వెళుతుంది. ఇక గత సంవత్సరం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో నటించింది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది.. ఆ సినిమా తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

ఇక అందులో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అనుష్క ను చూడబోతున్నామని కూడా చెప్పవచ్చు. ఎంతో క్రూరంగా ఆమె ఆ గ్లింప్స్ లో కనిపిస్తుంది.  అయితే అనుష్క హీరోయిన్ గా మారడం అనేది ఎంతో విచిత్రంగా జరిగింది. ఆమె యోగ టీచర్  గా వర్క్ చేసే సమయంలో ఊహించ‌ని విధంగా ఆమెని దర్శకుడు పూరి జగన్నాథ్ , నాగార్జున చూసి మరో ఆలోచన లేకుండా సినిమాల్లోకి తీసుకువచ్చారు. నాగార్జున అయితే ఆమె అందానికి ఎంతో ఫీదా అయిపోయారట. ఆమె తనకు యాక్టింగ్ రాదని చెప్పినా కూడా మనమే దగ్గర ఉండి నేర్పిద్దామని చెప్పి ఆమెని సినిమాల్లోకి తీసుకువచ్చారట. అయితే అనుష్క మాత్రం తాను ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదట .. అయితే అనుష్క జాతకం చూసిన ఆమె యోగా గురువు మాత్రం ముందే ఆమెకు చెప్పాడట నువ్వు సినిమాల్లోకి వెళ్తావ్ మంచి నటివి అవుతాశ‌ని చెప్పారట .. ఆయన అన్నదే జరిగిందని అనుష్క ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.  

ముందుగా అనుష్క డాక్టర్‌ కావాలని అనుకుందట .. కానీ అనుకోకుండా హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుని జాగ్రఫీ టీచర్గా పని చేసిందట.. అలా కొన్నాళ్లు ఆమె కాలేజ్ లెక్చరర్ గా కూడా వర్క్ చేసిందట. ఆ సమయంలోనే తన యోగా గురువు భరత్ ఠాకూర్‌ కలిశారట. ఆయనతో పరిచయం యోగా వైపు తీసుకెళ్లిందని చెప్పింది అనుష్క. యోగా క్లాసులకు వెళ్తున్నప్పుడు తనకు కావాల్సింది ఇదే అని, యోగా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదని, ఇదే తన లైఫ్‌ అని ఫిక్స్ అయ్యిందట. అయితే ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు దెబ్బకి పేరెంట్స్ షాక్‌ అయ్యారట. నాన్న  యోగా వైపు వెళ్లడమేంటి అని షాక్‌ అయ్యాడట. అయితే ఆ విషయంలో అనుష్క మాత్రం భయపడిందట సన్యాసిగా మారిపోతానా ఏంటి అని చాలా రోజులు ఆమె ఎంతో భయపడిందట. చాలా రోజులు ఆమె దిగాలుగానే ఉందంట. అలా యోగ టీచర్గా పని చేస్తున్న సమయంలోనే ఆమెకు సినిమాలో అవకాశాలు రావడం మొదలయ్యాయని ఆమె చెప్పకు వచ్చింది. అలా యోగ టీచర్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఇక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారింది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: