ఈ మెగా హీరో పరిస్థితి ఇంత దారుణమా.. ఈసారి హిట్ కొట్టకపోతే..?
ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కెరియర్ ప్రారంభంలో డిఫరెంట్ కథలతో మెప్పించిన వరుణ్ తేజ్ అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేసి mసక్సెస్ ని అందుకోలేకపోతున్నాయట. వరుణ్ తేజ్ చివరిగా నటించిన చిత్రాల విషయానికి వస్తే.. గని, గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాలన్నీ కూడా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రాల కోసం ప్రత్యేకమైన మేకోవర్ తీసుకొని మరి ప్రయత్నించిన వరుణ్ తేజ్ కు క్లాసులు గాని మిగిలాయి.
గని సినిమా లాంగ్ రన్ టైం కేవలం 8 కోట్ల కలెక్షన్ చేసింది.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తూరు డైరెక్షన్ లో వచ్చిన గాండీవ దారి అర్జున కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టిందట.. చివరిగా తెలుగు,హిందీ భాషలలో నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా 9 కోట్లు మాత్రమే రాబట్టిందట. ఇలా ఇవన్నీ కూడా లాంగ్ డ్రైన్ టైంలో మాత్రమే రాబట్టాయట. ఈ చిత్రాలన్నీ ప్రస్తుతం మట్కా సినిమా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ రాబట్టేలా కనిపించడం లేదు.. వరుణ్ తేజ్ ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఈసారైనా ఈ సినిమాతో మీ మెగా హీరో నిలబడతారో లేదో చూడాలి.