సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఒక సినిమాను ఒక నటుడుతో అనుకొని , ఆయనకు కథను వివరించినప్పుడు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కొంత కాలం అయ్యాక అతనిని తీసివేసి మరొకరిని హీరోగా పెట్టుకోవడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటన శోభన్ బాబు కెరియర్ లో కూడా ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. శోభన్ బాబు ను హీరో గా అనుకొని అంతా ఫిక్స్ అయ్యాక కొన్ని కారణాల వల్ల శోభన్ బాబు ను ఓ సినిమా నుండి తప్పించి అందులో కృష్ణ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఏది ..? ఎందుకు శోభన్ బాబు ను తప్పించి కృష్ణ ను ఆ సినిమాలో తీసుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ "గూడాచారి 116" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జయ లలిత హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే మొదట ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో కృష్ణ ను కాకుండా శోభన్ బాబు ను హీరోగా అనుకున్నారట. ఆయనకు కథను వివరించగా , ఆయన కూడా ఓకే చెప్పాడట. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో జయ లలిత ను హీరోయిన్గా అనుకున్నారట. ఇక హీరో ఎవరు అని జయ లలిత తల్లి సంధ్య అడగగా .. శోభన్ బాబు అని చెప్పారట.
దానితో శోభన్ బాబు కాస్త కలర్ తక్కువ. అతను హీరోగా అయితే జయ లలిత సినిమా చేయడం కష్టమే అని ఆమె చెప్పిందట. ఇక అప్పటికి శోభన్ బాబు కు కూడా భారీ క్రేజ్ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని మేకర్స్ ఆ తర్వాత శోభన్ బాబు ను ఆ మూవీ నుండి తప్పించి ఈ సినిమాలో కృష్ణ ను హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు తెలుస్తోంది.