డబ్బులు బాగా పొదుపు చేస్తున్న సుకుమార్.. ఒక్క నిర్ణయంతో అన్ని కోట్ల లాభం..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఇప్పటివరకు ఈయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో చాలా శాతం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే సుకుమార్ ఆఖరుగా అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా పుష్ప పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సుకుమార్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 ను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే పుష్ప పార్ట్ 1 సినిమాలో సమంత స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇండియా వ్యాప్తంగా లభించింది. పుష్ప పార్ట్ 2 లో కూడా స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు అనేక రోజులుగా వార్తలు వచ్చాయి. ఇకపోతే కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ఓ వార్త బలంగా వైరల్ అయింది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు , దానితో మూవీ బృందం అంతా మొత్తం వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ యూనిట్ శ్రీ లీల ను ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కి తీసుకున్నారు. ఇప్పటికే స్త్రీలపై ఈ మూవీ యూనిట్ స్పెషల్ సాంగ్ షూటింగ్ను కూడా మొదలు పెట్టింది. ఇకపోతే శ్రీ లీల ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కి కోటి రూపాయలు పారితోషకం  తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దానితో సుకుమార్ , శ్రద్ధ కపూర్ విషయంలో వెనక్కు తగ్గడంతో ఈ మూవీ నిర్మాతలకి ఏకంగా ఏడు కోట్లు మిగిలినట్లు తెలుస్తోంది. అలా సుకుమార్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో పుష్ప నిర్మాతలకు ఏడు కోట్లు మిగిలినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: