"వెన్నెల్లో హాయ్ హాయ్" అంటూ మ్యూజిక్ ప్రియులను ఉర్రూతలూగించిన చక్రి..!!

Pandrala Sravanthi
- తన గానంతో అందరిని ఆకర్షించిన చక్రి..
- నువ్వక్కడుంటే నేనిక్కడుంటా అంటూ కుర్రకారుని ఫిదా..
-పూరి జగన్నాథ్ వల్లే చక్రికి మంచి గుర్తింపు..

 దివంగత సంగీత దర్శకుడు గాయకుడు అయినటువంటి చక్రి తన మ్యూజిక్ తో ఎంతోమంది మ్యూజిక్ ప్రియులను అలరించారు. ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈయన పాడిన,మ్యూజిక్ అందించిన కొన్ని పాటలు అయితే యూత్ ని అప్పట్లో ఫిదా చేశాయి.మరి అలాంటి సంగీత దర్శకుడు చక్రి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1974 జూన్ 15న జన్మించాడు.చక్రీకి చిన్నప్పటినుండి బిజినెస్ చేయాలని ఆలోచన ఉండేది.కానీ చక్రి టీచర్ అవ్వాలని ఆయన తండ్రి ఎంతగానే కోరుకున్నారు. అయితే చక్రికి ఒకరు ముందు చేతులు కట్టుకొని ఉద్యోగం చేయడం అంటే అస్సలు ఇష్టం లేదట.దాంతో వ్యాపారం చేసుకుని పదిమందికి ఉపాధి ఇస్తానని బట్టల దుకాణం పెట్టడానికి రెడీ అయ్యారట.కానీ ఫ్రెండ్స్ మాత్రం ఆయనని మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని హైదరాబాద్ వెళ్ళమని పట్టు పట్టడంతో చివరికి చక్రి హైదరాబాద్ బస్సు ఎక్కారట.ఇక సినిమాల్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు.అలా హైదరాబాద్ వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడి పది వేలు పెట్టి పండువెన్నెల అనే ఆల్బమ్ ని రిలీజ్ చేశారు.అయితే ఇది జనాల్లోకి వెళ్ళింది కానీ డబ్బులు అయితే రాలేదు. ఇక సినిమాలో మొదటి ఛాన్స్ పూరి "బాచి" సినిమాకి వచ్చింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పూరి తన నెక్స్ట్ సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కి చక్రీని తీసుకున్నారు. కానీ బాచి సినిమా ప్లాఫ్ అయింది. ఈ సినిమాకి చక్రి వద్దు అని నిర్మాత పట్టుబట్టారట.కానీ పూరి మాత్రం నిర్మాత మాటలు వినకుండా చక్రిని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు.

అలా ఈ సినిమాలోని మళ్లీ కూయవే గువ్వా అనే పాట ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది.దాంతో చక్రికి మంచి గుర్తింపు లభించింది. అయితే పూరి వల్లే ఇదంతా నాకు సాధ్యమైంది అని పూరి జగన్నాథ్ ని ఆయన చనిపోయే వరకు కూడా దేవుడిలాగే ఆరాధించారు. ఇక చక్రి మ్యూజిక్ అందించిన ఇడియట్,ఔనూ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, సత్యం,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,జై బోలో తెలంగాణ వంటి ఎన్నో సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యాయి. అయితే ఈయన మ్యూజిక్ అందించిన గోపి గోపిక గోదావరి సినిమాలోని నువ్వక్కడుంటే నేనిక్కడుంటే అనే పాటకి అప్పట్లో యూత్లో మంచి ఆదరణ లభించింది.ఇక ఎవరి ఫోన్లో చూసినా ఇదే రింగ్ టోన్ మోగేది. అలాగే వెన్నెల్లో హాయ్ హాయ్, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా అనే పాటలు చక్రికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఓ మగువా నీతో స్నేహం కోసం అనే పాటకి గానూ చక్రికి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే ఈయన సంగీత దర్శకత్వం వహించిన సింహ సినిమాకి నంది అవార్డు కూడా వరించింది. అలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా పనిచేసిన చక్రి 2014 డిసెంబర్ 15న గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మరణించిన సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చక్రి మరణించినప్పటికీ ఆయన పాటల ద్వారా ఇప్పటికీ సినీ ప్రియల్లో బతికే ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: