నాటు నాటు: టాలీవుడ్ ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లిన కీరవాణి ?
దీంతో అతనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1997లో నాగార్జున హీరోగా తెరకెక్కిన భక్తిరస చిత్రం అన్నమయ్య సినిమాకిగాను కీరవాణి సంగీతం అందించారు. తన అద్భుతమైన సంగీతానికి కీరవాణి అవార్డును సైతం అందుకున్నాడు. మళ్ళీ 26 ఏళ్ల అనంతరం ఇప్పుడు నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు. కాగా, కీరవాణి ఆస్కార్ అవార్డును గెలుచుకొని గ్లోబల్ రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 2022లో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మోసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకుంది. రాజమౌళికి ఈ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి కూడా గ్లోబల్ రేంజ్ లో ఫేమస్ అయ్యాడు.
ఓ తెలుగు చిత్రం ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారి. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్ గా ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్రను సృష్టించింది. ఇక నాటు నాటు పాటకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం కీరవాణి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.