టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది యాంకర్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు ఒకరు. ఇండస్ట్రీలో.. సినిమాలు పెద్దగా చేయకపోయినా ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు పెడుతూ.. యూత్ ను ఆకట్టుకుంటుంది టాలీవుడ్ స్టార్ యాంకర్ స్రవంతి. ఎన్నో షోలకు అలాగే టీవీ షోలకు... యాంకర్ గా.. పనిచేస్తూనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వెళుతుంది.
బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ స్రవంతి తాజాగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు స్వయంగా... స్రవంతి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు చిన్న సర్జరీ కూడా అయిందని... కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు ఈ పోస్టులో వెల్లడించింది యాంకర్ స్రవంతి.
అంతేకాదు తన ఫాలోవర్స్ అలాగే ఫ్యాన్స్ కు ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. ఆరోగ్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని.. చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రిలో చూపించుకోవాలని కోరింది. గత 40 రోజుల నుంచి... విపరీతమైన బ్లీడింగ్ ఉందంటూ వెల్లడించింది. దానికోసం మెడిసిన్ కూడా వాడినట్లు తెలిపింది. కానీ షూటింగ్ బిజీ కారణంగా స్కానింగ్ సరిగ్గా చేయించుకోలేదని వెల్లడించింది స్రవంతి. ఇక ఇటీవల తన సమస్య విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది.
దాంతో నొప్పి భరించలేకపోయానని... విపరీతమైన కడుపునొప్పి కారణంగా షూటింగ్లకు కూడా వెళ్లలేకపోయాను అని వెల్లడించింది యాంకర్ స్రవంతి. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లానని... అక్కడ వైద్యులు సర్జరీ చేశారని కూడా తెలిపింది. దీంతో ఇప్పుడు రిలీఫ్ గా ఉందని తెలిపింది. మరో నాలుగు ఐదు వారాల తర్వాత... ఇప్పటిలాగే తాను నడుస్తానని డాక్టర్ చెప్పినట్లు వివరించింది. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.