"ఆ సినిమా నేను చేసుంటే ఇంకా బాగుండేదేమో..?"..ఇన్నాళ్లకు ఓపెన్ అప్ అయిపోయిన నాగార్జున..!

Thota Jaya Madhuri
నాగార్జున ఏ విషయనైనా సరే చాలా సరదాగా తీసుకుంటారు.  ఆయన సీరియస్ అయినా సందర్భాల్లో చాలా చాలా రేర్.  అసలు ఇప్పటివరకు ఆయన సీరియస్ అయిన సందర్భాలు మనం ఎక్కడా కూడా చూడలేదు. ఏదో నిన్న కాక మొన్న అక్కినేని మాజీ ఇంటికి కోడలు సమంత పై కొండ సురేఖ వేయరాని నింద వేయడంతో ఆయన రియాక్ట్ అయ్యాడు తప్పిస్తే .. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా తన కొడుకు అదే విధంగా తన మాజీ భార్య ..తన ప్రజెంట్ భార్యను ఏ విధంగా ట్రోల్ చేసినా కూడా అక్కినేని నాగార్జున ఎప్పుడు కూడా స్పందించింది లేదు .


మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కారణంగా ఆయన పేరుని ఏ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి చేశారో ఆకతాయిలు మనం చూసాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు అక్కినేని నాగార్జున . అయితే నాగార్జున ఒక విషయాన్ని మాత్రం చాలా ఓపెన్ గా చెప్పేశాడు . సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సరే ..ఆ సినిమాలో వేరే స్టార్ నటించి.. ఆ సినిమా హిట్ అయితే అబ్బబ్బ మనకి ఇలాంటి సినిమా పడితే ఎంత బాగుండో అనుకుంటారు.   ఆ విషయాన్ని కొంతమంది బయటకు చెప్తారు. మరికొందరు తమలో తామే అనుకుంటూ ఉంటారు.


కానీ నాగార్జున మాత్రం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు . ఒకానొక ఈవెంట్లో నాగార్జున "సంక్రాంతి" లాంటి సినిమా నాకు వచ్చుంటే చాలా బాగుండేది అని.. ఆ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యుండేవాడి ని అని నాగార్జున చెప్పుకొచ్చాడట.  సంక్రాంతి సినిమాలో వెంకటేష్ హీరో గా నటించారు . అంతేకాదు శివ బాలాజీ అదే విధంగా శర్వానంద్ ఆయనకు తమ్ముళ్లుగా కనిపిస్తారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎన్ని సార్లు చూసిన సరే బోర్ కొట్టవు.. తనవి తీరవు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: