ఒక్క మగాడు : సినిమానే కాదు లుక్ విషయంలో కూడా బాలయ్య పై ట్రోల్స్.. ఎక్కడ తేడా కొట్టింది..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య తన కెరీర్లో కొన్ని ఫ్లాప్ మూవీలలో కూడా నటించాడు. బాలయ్య ఎన్నో ఫ్లాప్ మూవీలలో నటించిన తన నటన విషయంలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న సినిమాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కొన్ని సినిమాలలో మాత్రం బాలకృష్ణ నటన పరంగా మంచి ప్రశంసలను అందుకున్న లుక్ విషయంలో మాత్రం నెగటివ్ కామెంట్స్ ను అందుకోవాల్సి వచ్చింది.

అలా బాలకృష్ణ లోక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ ను అందుకున్న సినిమాలలో ఒక్క మగాడు మూవీ ఒకటి. వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ , అనుష్క , విషా కోటరీ బాలకృష్ణ కు జోడిగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ని వై వి ఎస్ చౌదరి స్వయంగా నిర్మించాడు. ఈ మూవీ 2008 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ విషయాన్ని పక్కన పెడితే ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో బాలయ్య ఒల్డ్ గెటప్ లో కనిపించగా , మరొక పాత్రలో యంగ్ గెటప్ లో కనిపించాడు. యంగ్ గెటప్ విషయంలో పెద్దగా నెగిటివ్ కామెంట్స్ ఏమీ రాకపోయినా , ఓల్డ్ పాత్ర విషయంలో మాత్రం చాలా నెగటివ్ కామెంట్స్ సినిమా విడుదల సమయంలో వచ్చాయి.

బాలయ్య కు ఓల్డ్ గెటప్ అస్సలు సెట్ కాలేదని , వేరేదైన లుక్ ట్రై చేసి ఉంటే బాగుండేది అని , ఆ లుక్ ఆయనపై పెద్దగా వర్కౌట్ కాలేదు అని అభిప్రాయాలను చాలా మంది జనాలు ఈ సినిమా విడుదల సమయంలో వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్యకు నిరాశనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: