ఆ కోరిక తీరకుండానే చనిపోయిన ఆర్తి అగర్వాల్... ఏ జన్మలో ఏ పాపం చేసిందో..?

Thota Jaya Madhuri
ఈ భూమిపై ఏది ఎవరికి శాశ్వతం కాదు అని ఎన్నో సందర్భాలలో మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా అది స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీస్ కి ఎక్కువగా వర్తిస్తుంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు . నేడు డబ్బుంది రేపు డబ్బులు లేకపోవచ్చు.  ఇవాళ డబ్బుంది కదా అని ఎవరిని కూడా కించపరచకూడదు.. సహాయం కోసం మన ఇంటి వద్దకు ఎవరైనా వస్తే హెడ్ వెయిట్ తో అలాంటి వ్యక్తులను అవమానించకూడదు . అంతేకాదు కోట్ల ఆస్తి ఉంది కదా ఇక ఏమి నాకు అనే విర్రవీగిన చాలామంది కూడా లాస్ట్ రోజుల్లో రూపాయి కూడా చేతుల లేకుండా దిక్కుమాలిన స్థితిలో చనిపోయిన స్టార్స్ కూడా ఉన్నారు.


 రీసెంట్గా ఆర్తి అగర్వాల్ కిసంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఆర్తి అగర్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందాల కుందనపు బొమ్మ. " నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో ఆమె పర్ఫామెన్స్ ఎంతలా అందరినీ ఆకట్టుకుందో చెప్పాలా..? ఇప్పటికి ఆ సినిమా టీవీలో వస్తే వెంకటేష్ కోసం చూసే జనాల కన్నా ఆర్తి అగర్వాల్ కోసం చూసే జనాలు  ఎక్కువ  అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె ట్రెడిషనల్ లుక్స్ అదేవిధంగా మోడ్రన్ లుక్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి.


కాగా ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని ఏలేసింది అనే చెప్పాలి . చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా ఆర్తి అగర్వాల్ నటనను ఒక స్టేజిపై ఓపెన్ గానే పొగిడేశారు. అయితే ఏం లాభం  ఆమె లైఫ్ లో కొన్ని తప్పుడు డెసిషన్స్ కారణంగా ఆమె లైఫ్ చిందరవందర గా మారిపోయింది.  సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆర్తి అగర్వాల్ హిట్ కొట్టడానికి బాగా ట్రై చేసింది . కానీ హిట్ కొట్టలేకపోయింది . అయితే ఆర్తి అగర్వాల్ తన చివరి కోరిక తీరకుండానే చనిపోయిందట . ఆర్తి అగర్వాల్ కి అమ్మ అని పిలిపించుకోవాలని చాలా చాలా ఆశగా ఉండిందట . పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేసిందట . కానీ ఆమె ఆ కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది అని తెలుసుకొని జనాలు ..ఆమె ఫ్యాన్స్ ..బాగా ఫీల్ అయిపోతూ బాధపడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: