ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసే ఎన్టీఆర్.. ఆ హీరోయిన్ తో డాన్స్ చేయడానికి అంత కష్టపడ్డాడా..?

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా అవలీలగా చెప్పగలడు . గుక్క తిప్పుకోకుండా ఊపిరి పీల్చుకోకుండా ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగల్ టేక్ లో ఓకే చేస్తాడు. అంతేకాదు ఎలాంటి కఠిన సీన్స్ అయినా సరే ఆయన చాలా చాలా తక్కువ టేక్స్ లోను ఓకే చేసేస్తూ ఉంటారు.  అయితే ఆయన దగ్గర ఉన్న మరో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఎటువంటి హార్డ్ స్టెప్స్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయకుండానే సింగిల్ టేక్ లో ఓకే చేసేస్తారు.  ఆ విషయాన్ని చాలామంది కొరియోగ్రాఫర్స్ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు .


మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో ఎన్నో సినిమాలలో చాలా కఠినమైన స్టెప్స్ ని కూడా అవలీలగా వేసి మెప్పించారు . వితౌట్ సపోర్ట్ ఆయన అలాంటి స్టెప్స్ వేయడం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం . ఎన్నో పెద్ద పెద్ద సినిమాలలో కఠిన స్టెప్స్ ని కూడా చాలా అవలీలగా వేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ డాన్స్ స్టెప్స్ స్పీడ్ మాత్రం అందుకోలేకపోయాడట. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా నెట్టింట ట్రెండ్ అయిపోతుంది.


ఆ హీరోయిన్ మరెవరో కాదు "రంభ".  ఎస్ రంభ ఎంత మంచి డాన్సర్ అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? అసలు అవసరం లేదు.  ఆమె సినిమాలు చూస్తే ఆ విషయం అందరికీ ఈజీగా అర్థమయిపోతుంది . అయితే రంభ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఓ పాట చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "యమదొంగ" సినిమాలో రంభ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది.  ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా మారింది. ఎంతలా అంటే ఆమె డ్రస్  దగ్గర నుంచి ఆమె స్టెప్స్ వరకు బాగా జనాలను ఆకర్షించాయి.  అంతేకాదు ఆమె డాన్స్ వేసేటప్పుడు ఆమె డాన్స్ స్టెప్స్ స్పీడ్ అందుకోవడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారట.  ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు . ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాలా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: