చిరుత: రాంచరణ్ లుక్ పై తీవ్ర విమర్శలు...కట్ చేస్తే గ్లోబల్ స్టార్ రేంజ్.!

FARMANULLA SHAIK
మెగా వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా త‌న న‌ట‌న‌, అభిన‌యంతో సినీరంగంలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రామ్‌చరణ్‌. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారి పలు సూపర్‌ హిట్‌ విజయాలు అందుకున్నాడు. ఇక గతేడాది రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దిగ్గజ హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌లోని చరణ్‌ నటనకు ఫిదా అయ్యారు. ఇక చిరు నుంచి నటననే కాదు డ్యాన్స్‌లను కూడా తెచ్చుకున్నాడు. ఇండియాలోని బెస్ట్‌ డ్యాన్సర్లలో చరణ్‌ ఒకడు. ఇక లుక్స్ పరంగానూ ఒకప్పుడు తీవ్ర విమర్శలు అందుకున్న చరణ్‌ ఇప్పుడు ఐకాన్‌ ఆఫ్‌ ది స్టైల్‌గా మారిపోయాడు.ఇదిలావుండగా మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో ఆయన మహావృక్షంలా ఎదిగారు. ఆయన నీడలో ఎంతో మంది స్టార్లు వచ్చి రాణిస్తున్నారు. అయితే తన కొడుకు రామ్‌ చరణ్‌ని హీరోగా ఎంట్రీకి సంబంధించి చిరంజీవి చాలా ప్లాన్స్ చేశారు.ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పోకిరి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఆ సినిమా చిరుకి కూడా బాగా నచ్చింది.దాంతో ఇలాంటి మాస్‌ కమర్షియల్‌ యాక్షన్‌ మూవీ అయితే బాగుంటుందని భావించి పూరీకి ఆ బాధ్యతలు అప్పగించారు. చిరంజీవి చెప్పడంతో పూరీ కూడా జెట్‌ స్పీతో కథ రెడీ చేశాడు. అలా చిరుత సినిమా పట్టాలెక్కింది. మొదటి మూవీతోనే ఫేస్ అప్పిరెన్స్ లేదని ఇండస్ట్రీలో నిలబడలేడనే విమర్శలు అప్పట్లో భూమారం లేపాయి. కేవలం మెగాస్టార్ కొడుకనే చూడాలని అంతకంటే చరణ్ లో ఇంకో గొప్ప క్వాలిటీ లేదని అందరూ అనుకున్నారు. ఇందులో నేహా శర్మని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ అమ్మాయి కొత్త. ఈ మూవీతోనే వెండితెరకి పరిచయం చేశారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మించారు. అలా చిరుత రామ్‌ చరణ్‌ హీరోగా వెండితెరకి పరిచయమయ్యారు. ఈ మూవీ 2007లో సెప్టెంబర్ 28న విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది.

అయితే ఈ సినిమాలో చరణ్‌ లుక్స్‌పై విమ‌ర్శలు కూడా బాగానే వ‌చ్చాయి. చ‌రణ్‌కు న‌ట‌న రాద‌ని, హీరో ఫేస్ కాద‌ని ప‌లువురు క్రిటిక్స్ విమ‌ర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్‌, చిరంజీవి మేనియాతోనే హిట్ట‌యింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.తర్వాత చేసిన ఆరెంజ్తో కొద్దిగా చేంజ్ అయ్యారు. ఆతర్వాత జక్కన్న చెక్కిన మగధీరతో ప్రేక్షకులలో ఆ రకమైన అభిప్రాయం కొంచం కొంచం దూరంమవుతా వచ్చింది. ఆతర్వాత కొన్ని చిన్న చిన్న సర్జరీలతో ఫేస్లో వేరియేషన్స్ చూపిస్తా ప్రస్తుతం ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే రెండేళ్ల క్రితం జక్కన్న చెక్కిన మరో అద్భుతం ఆర్ఆర్ఆర్ దింట్లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు.దాంతో గ్లోబల్ స్టార్ట్ రేంజ్ కి ఎదిగాడు.అయితే చిరుత టూ ఆర్ఆర్ఆర్ జర్నీ లో రాంచరణ్ తన లుక్ లో చాలా మార్పులు చేసుకున్నట్టు పాత్రకు తగ్గట్టుగా ఫేస్ లుక్స్ చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం చరణ్‌ రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు అందులో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ ఒకటి. ఈ సినిమాకు ‘గేమ్‌ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతున్న ఈ సినమాలో చరణ్‌కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది. ఇక దీనితో పాటుగా చరణ్ తన 16వ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ఉప్పెన ఫేం బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: